పుట్టింట్లోనే భార్య గదిలోకి రెండు సార్లు పాముని వదిలి…నగలకోసం భర్త పెద్ద స్కెచ్..!

పుట్టింట్లోనే భార్య గదిలోకి రెండు సార్లు పాముని వదిలి…నగలకోసం భర్త పెద్ద స్కెచ్..!

by Megha Varna

Ads

వరకట్నం కోసం వేదింపులు ఎదుర్కొని ఇబ్బంది పడినవారు ఉన్నారు.వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు.అయితే కట్టుకున్న భార్య అదనపు కట్నం తీసుకురాలేదని ఎలా ఐన భార్యను అంతమొందించాలనుకున్నాడు ఓ భర్త .అయితే పోలీస్ కేసు తనమీదకి రాకుండా పాముతో కరిపించి చంపేశాడు ఓ కసాయి భర్త.వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

కేరళలో కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్,ఉత్ర భార్యాభర్తలు.అయితే వీరికి సంవత్సరం వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు.చాలా కాలం నుండి వీరి కుటుంబం సంతోషంగానే ఉంది.కానీ ఈమధ్యకాలంలో ఉత్ర ను అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా కోరాడు భర్త సూరజ్.అయితే ఉత్ర మరియు తన కుటుంబం దగ్గర నుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇంకా ఉత్ర కట్నం తీసుకురాలేదని గ్రహించాడు సూరజ్.కాబట్టి ఉత్ర అడ్డు తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.అందుకోసం పక్క ప్రణాళిక రచించాడు సూరజ్.

representative image

పాములు పట్టే  వాడికి కొంత డబ్బు ఇచ్చి పామును ఉత్ర నిద్రపోతుండగా తన మీదకు వదిలాడు.అయితే పాము కాటు వేసిన తర్వాత ఆ విషయం గ్రహించిన ఉత్ర పక్కింటి వారి సహకారంతో ఆసుపత్రి కి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది.అయితే ఉత్ర తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది.మళ్ళీ కొంత కాలం తర్వాత సూరజ్ దగ్గరకి వచ్చింది.అయితే మళ్ళీ పాముతో కురిపించాడు సూరజ్.అయితే ఈసారి ఉత్ర ఆసుపత్రి కి వెళ్లేలోపే చనిపోయింది.రెండుసార్లు ఇదేవిధంగా జరగడంతో ఉత్ర ఇంట్లో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు.పోలీస్ లు అరా తియ్యగా తన సోదరుడు ఆస్థి కోసమే ఇలా చేసి ఉంటాడడని మొదట్లో దబాయించిన సూరజ్ తర్వాత పోలీసులు తమ స్టైల్ లో అడిగేటప్పటికీ నిజాన్ని ఒప్పుకున్నాడు సూరజ్.అదనపు కట్నం కోసమే ఇలా చేసానని పోలిసుల దర్యాప్ట్టులో వెల్లడించాడు సూరజ్.


End of Article

You may also like