Ads
ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. తన భార్య డెలివరీ టైం దగ్గర పడింది అని తెలిసి ఈ సమయంలో తన పక్కన ఉండాలి అని తన భార్య దగ్గరికి వెళ్తున్న ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.
Video Advertisement
నరసన్నపేట మండలం దూకులపాడు కి చెందిన అల్లు అమ్మ నాయుడు అనే వ్యక్తికి ఏడాది క్రితం పెళ్లయింది. గత 12 ఏళ్లుగా విశాఖ జిల్లా యలమంచిలి లో ఒక ప్రైవేట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం అతని భార్య గర్భిణి గా ఉన్నారు. ఈ నెల 8వ తారీఖు డెలివరీ టైం అని డాక్టర్లు చెప్పడంతో తన భార్య దగ్గరికి బయల్దేరారు అమ్మ నాయుడు.
తను ఉద్యోగం చేస్తున్న ప్రాంతం యలమంచిలి నుండి సొంతూరైన దూకులపాడుకు కు మోటార్ వెహికల్ పై వెళ్తుండగా దారిలో విజయనగరం జిల్లా భోగాపురం – పూసపాటిరేగ సమీప ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దెబ్బలు ఎక్కువగా తగలడంతో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే చివరి శ్వాస విడిచారు. అమ్మ నాయుడు కుటుంబం తీవ్ర విషాదం లో ఉన్నారు.అతని భార్య రోదించిన తీరు అక్కడ ఉన్న వాళ్ళ అందరి హృదయాన్ని కలచి వేసింది.
End of Article