Ads
ఈరోజుల్లో చాలామంది జనాలలో నేర ప్రవృత్తి పెరుగుతూ పోతుంది.నమ్మినవారు కూడా మోసాలు చేస్తుండడంతో ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి ఈరోజులలో ప్రజలది.అయితే కట్టుకున్న భార్య దగ్గర నుండి బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయలు గుంజుకున్నాడు ఓ భర్త .ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
కరీంనగర్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తి మాట్రిమోనీ వెబ్ సైటులో ఫేక్ ప్రొఫైల్ ను తెరిచి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని నమ్మించి 10 లక్షల కట్నం మరియు 5 లక్షల ఆడపడచు కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి ఐన కొన్ని నెలలకే ఉద్యోగ రీత్యా సంతోష్ భార్య అమెరికా కు వెళ్ళింది.దీంతో హర్ష వర్ధన్ రెడ్డి అనే పేరుతో ఒక సిమ్ కార్డు తీసుకోని అదే పేరుమీద ఒక మెయిల్ కూడా సృష్టించాడు.
అయితే సంతోష్ తన భార్యతో కలిసి ఉన్న కొన్ని అశ్లీల వీడియోలను ,ఫోటోలను తన భార్య అకౌంట్ కు పంపి హర్షన్ వర్ధన్ రెడ్డి ని అని చెప్తూ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు.దీంతో భయభ్రాంతురాలైన సంతోష్ భార్య ఆ విషయాన్నీ సంతోష్ కు చెప్పింది.కాగా నీకెందుకు నేను చూసుకుంటాను అని సంతోష్ తన భార్య తో చెప్పాడు.కాగా డబ్బులు పంపిస్తే హర్ష వర్ధన్ రెడ్డి తో సెటిల్మెంట్ చేసి ఆ ఫోటోలు ,వీడియోలు బయటకు రాకుండా చూసుకుంటాను అని చెప్పి దాదాపు కోటి రూపాయలు తన భార్య దగ్గర నుండి తీసుకున్నాడు సంతోష్.
అయితే కోటి రూపాయలు ఇచ్చిన హర్ష వర్ధన్ రెడ్డి అనే అకౌంట్ నుండి బెదిరింపులు ఆగకపోవడం వలన అమెరికా నుండి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు సంతోష్ భార్య.అయితే కేసు నమోదు కేసుని దర్యాప్తు చెయ్యడం ప్రారంభించిన పోలీసులు సంతోష్ ని అదుపులోకి తీసుకోని విచారించేటప్పటికీ అసలు విషయం వెలుగులోకి వచ్చింది.అయితే సంతోష్ ఇదివరకు కూడా కొంతమంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కాజేసినట్లు పోలీసులు తెలిపారు.
End of Article