Ads
చెన్నైలో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే. పళని, చెన్నైలోని మైలాపూర్ లోని లాలా ఎస్టేట్ లో నివాసం ఉంటున్నారు. పళని సొంతంగా ఆటో తీసుకొని నడుపుతున్నారు. పళని, కొంతకాలం క్రితం మరియాల్ అనే ఒక యువతిని పెళ్లి చేసుకున్నారు. పళనికి అంతకుముందు ఒక వివాహం అయ్యింది. మొదటి భార్యతో గొడవలు ఎక్కువగా ఉండేవి.
Video Advertisement
4 సంవత్సరాల క్రితం పళని మొదటి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. పళని, మరియాల్ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కొంత కాలం నుండి వ్యక్తిగత కారణాల వల్ల పళనికి, మరియాల్ కి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పళని తమ్ముడు సెంథిల్ ఒక ప్రైవేట్ ఉద్యోగి. సెంథిల్, మరియాల్ కి మధ్య అక్రమసంబంధం ఉంది.
అన్న లేనప్పుడు సెంథిల్ మరియాల్ ని కలుస్తూ ఉండేవారు. తర్వాత ఈ విషయం అందరికి తెలిసి చాలా పెద్ద గొడవ అయ్యింది. కుటుంబ సభ్యులు ఇది తప్పు అని ఇద్దరిని హెచ్చరించారు. అయినా కూడా ఫలితం లేదు. ఒకరోజు రాత్రిపూట పళని మద్యం సేవించి ఇంటికి వచ్చారు. పళని వచ్చిన సమయంలో మరియాల్ తో పాటు సెంథిల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
వారి సరసాలు చూసి కోపం తెచ్చుకున్న పళని ఆటోలో ఉన్న ఇనుప రాడ్ తీసుకొచ్చి సెంథిల్,మరియాల్ పై దాడి చేశారు. సెంథిల్ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పళని ఇనుప రాడ్ తో సెంథిల్ తలపై కొట్టారు. సెంథిల్ పడిపోవడంతో పళని పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకని తీసుకొచ్చి సెంథిల్ పై దాడి చేశారు. దాంతో సెంథిల్ మరణించారు.
End of Article