లాక్ డౌన్ వేళ…ప్రియుడిని పెళ్లిచేసుకోడానికి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

లాక్ డౌన్ వేళ…ప్రియుడిని పెళ్లిచేసుకోడానికి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

by Megha Varna

కరోనా వైరస్ కారణంగా అందరు సామాజిక  దూరం పాటించాలంటూ ఇప్పటికే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా గురువారం ఆంధ్రప్రదేశ్ లో ఓ యువతీ తన గ్రామానికి సమీపంలో నివసిస్తున్న తన ప్రియుడిని వివాహం చేసుకునేందుకు 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది ..

Video Advertisement

representative image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలోని హనుమాన్ జంక్షన్ లో నివసిస్తున్న చితికేల భవాని(19). ఈడేపల్లి గ్రామ నివాసి అయిన సాయి పున్నయను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకుంది.భవాని ఉండే ప్రదేశం నుండి సాయి పున్నయ్య నివాసం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ..ఆ విధంగా ప్రేమ కోసం భవాని ప్రయాణం ప్రారంభమైంది .గత నాలుగు సంవత్సరాలుగా భవాని ,సాయి ప్రేమ వ్యవహారం నడుస్తుంది.వీరి ప్రేమకు భవాని తల్లితండ్రులు ఒప్పుకోలేదు ..దీంతో ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

 

representative image

ఏది ఏమైనా ,తమ ప్రణాళిక ప్రకారం పారిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ..ఈలోపు దేశమంతటా పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు .దీంతో చేసేది ఏమి లేక నిస్సహాయంగా ఇంట్లో ఇరుక్కుపోయిన భవాని గురువారం కాలినడక ద్వారా సాయి పున్నయ్య దగ్గరకు చేరాలని తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.60 కిలోమీటర్లు నడిచిన తర్వాత చివరకి తన ప్రియుడిని చేరుకొని వివాహం చేసుకొంది. .ఆ తర్వాత భవాని కుటుంబ సభ్యులు వీరిద్దరిని బెదిరించడంతో వారు బయపడి పోలీసులను ఆశ్రయించారు .వీరిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారి కుటుంబ సబ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి స్టేషన్ కు పిలిపించారు .

శుక్రవారం ఉదయం కొత్తగా వివాహం చేసుకున్న జంట రక్షణ కోసం మా వద్దకు వచ్చారు .వారి వివరాలను తీసుకునేటప్పుడు ,అమ్మాయి తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి చాలా దూరం నడిచిందని మాకు తెలిసింది అని స్థానిక సిఐ వెంకట్ నారాయణ్ తెలిపారు …యువతి కుటుంబం నుండి యువతి కనిపించట్లేదని మాకు పిర్యాదు వచ్చింది .ఇద్దరు మేజర్లు  కావున అమ్మాయి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాము అని సదరు సిఐ తెలిపారు ..

లాక్ డౌన్ ముగిసిన తర్వాత వివాహం చేసుకుందాం అనుకున్నాము ..కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే లాక్ డౌన్ ముగిసేలా కనిపించకపోవడంతో ఇక వేచి ఉండలేక కాలినడకన సాయి పున్నయను కలుసుకొని వివాహం చేసుకున్నాను అని భవాని తెలిపారు ..


You may also like

Leave a Comment