Ads
హర్యానా ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ వివాహానికి మూడు లక్షల మంది అతిధులు రాబోతున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. భవ్య బిష్ణోయ్ గతంలో టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ తెలియని కారణాల వలన ఆ నిశ్చితార్థం కొన్ని రోజులకే రద్దయింది ఇప్పుడు భవ్య బిష్ణోయ్ ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్ తో వివాహం జరగనుంది.
Video Advertisement
డిసెంబర్ 22న వివాహం నిశ్చయమైంది. మూడు చోట్ల రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. అంతటితో ఆగిపోతే ఈ పెళ్లి హాట్ టాపిక్ అయ్యేది కాదు కానీ ఈ పెళ్లికి ఆహ్వానితులు మూడు లక్షల మంది రాబోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ భవ్య బిష్ణోయ్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు. ఇతను అదంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
ఇక పరి విషయానికి వస్తే ఈమె స్వస్థలం రాజస్థాన్. ఈమె 2019లో సివిల్స్ కి ఎంపికై ఇప్పుడు గ్యాంగ్ టక్ లో విధులు నిర్వహిస్తుంది. కాగా వీరిద్దరి పెళ్ళికి అదంపూర్, పుష్కర్, ఢిల్లీలో వేరువేరుగా రిసెప్షన్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 80 గ్రామాల ప్రజలను విందుకు ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీలో జరిగే రిసెప్షన్ కి పార్టీ సీనియర్ నేతలు ప్రముఖులు హాజరవుతారని సమాచారం. ఇదే విషయం గా భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్ దీప్ మాట్లాడుతూ నా తండ్రి భజన్ లాల్ నా వివాహ సమయంలో కూడా అన్ని ఊర్లలో ప్రజలని ఆహ్వానించారు.
ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు పెళ్లికి నేను అదే చేయబోతున్నాను అని చెప్పుకొచ్చారు. కాగా వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఘనంగా జరగనుంది. ఒక పెళ్ళికి 80 గ్రామాల ప్రజలు అంటే 3 లక్షల మంది హాజరైతే ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూసి తీరవల్సిందే.
End of Article