“కరోనా” అంటే భయం పోయిందనుకుంటా? ఈ ఫోటోలు చూస్తే నిజమే అనిపిస్తుంది.!

“కరోనా” అంటే భయం పోయిందనుకుంటా? ఈ ఫోటోలు చూస్తే నిజమే అనిపిస్తుంది.!

by Megha Varna

Ads

వావ్ .. చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో.. అసలు ఇంతకాలం ఇలాంటి సన్నివేశం చూడడానికే కదా ఒళ్లంతా ఉన్న కొమ్ముల్ని కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నా … అనుకుంటూ వికటాట్టహాసం చేసి ఉంటుంది కరోనా వైరస్.. నిన్నటి ముంబై మెరైన్ డ్రైవ్ లో దృశ్యాన్ని చూసి… ఒకరు కాదు ఇద్దరు వందల సంఖ్యల్లో జనాలు వాకింగ్ ,జాగింగ్ పేరిట ఒక చోట చేరిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది..

Video Advertisement

కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ ని సడలించగానే జనం విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం ప్రారంభించారు..ఒకవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే మరోవైపు జనాలు వారివారి పనులకు రోడ్ల మీదికి వస్తూనే ఉన్నారు..అది కూడా మాస్క్ వాడాలి, భౌతిక దూరం పాటించాలి అనే మినిమం రూల్స్ పాటించకుండా..మహారాష్ట్ర ప్రభుత్వం రన్నింగ్,సైక్లింగ్ మరియు జాగింగ్ వంటి వ్యాయామాలకు సడలింపులు ఇవ్వడంతో మెరైన్ డ్రైవ్ లెక్కలేనంత జనం గుమిగూడారు..

 

“అన్‌లాకింగ్ మొదటి దశలో  జూన్ 3 నుంచి ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ కార్యకలాపాలు అనుమతించారు. జూన్ 6, 2020 సాయంత్రం మెరైన్ డ్రైవ్‌లో భారీగా జనం గుమిగూడారు” అంటూ  నిహారిక కులకర్ణి అనే నెటిజన్ మెరైన్ డ్రైవ్ దగ్గర జనాల ఫొటోని ఇన్స్టా లో శేర్ చేశారు.సోషల్ మీడియాలో వైరలయిన ఈ ఫొటోని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

‘‘బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా??.. షమాస్క్‌ కూడా సరిగా వేసుకోని ఈ జనాలు ఇళ్లకు వెళ్లి కరోనా గురించి లెక్చర్లు దంచుతారు”.అంటూ కొందరు కోపంగా కామెంట్ చేస్తే… “మెరైన్‌ డ్రైవ్‌ పేరును కరోనా డ్రైవ్‌గా  మార్చాలి అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు..

ముంబైలోనే కాదు ముషిరాబాద్ లోనూ అదే తీరు…

ముంబైలో మాత్రమే కాదు తెలంగాణాలో కూడా అదే పరిస్థితి..రాష్ట్రంలో అతిపెద్ద చేపల మార్కెట్ ముషిరాబాద్ ఫిష్ మార్కెట్.. ఇక్కడ రోజుకి లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది..ఎక్కడెక్కడి నుండో వినియోగదారులు ఇక్కడికి వచ్చి చేపలు కొనుగోలు చేస్తుంటారు.. మృగశిర కార్తె ప్రారంభం రోజు కావడంతో ఈ చేపల మార్కెట్ కూడా ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది.

జనాల ధోరణి చూస్తుంటే కరోనా భయం పోయిందా అనిపిస్తుంది.. ఇవి రెండు కేవలం ఉదాహరణలు మాత్రమే..అన్ని దేశాల్లో లాక్ డౌన్ కి ముందు లాక్ డౌన్ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంటే మన దేశంలో మాత్రమే  కేసులు పెరిగే క్రమంలో లాక్ డౌన్ సడలించారు.. జనం కూడా   40 కేసులు ఉన్నప్పుడు అందరు భయపడి ఇంట్లో దాక్కున్నారు. ఇప్పుడు రెండు లక్షల కేసులు ఉన్నా కూడా భయం లేకుండా తిరిగేస్తున్నారు.. జనాల ధోరణి చూస్తుంటే నెంబర్ 1 స్థానానికి ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అని ఉవ్విళ్లూరుతున్నట్టుంది..ప్చ్

images source: instagram.com/niharika_kulkarni

 


End of Article

You may also like