Home Filmy Adda ఏంటి తమన్ అన్నా… “భీమ్లా నాయక్” లో ఈ BGM కుడా కాపీయేనా..? ఏ పాట నుండి అంటే..?

ఏంటి తమన్ అన్నా… “భీమ్లా నాయక్” లో ఈ BGM కుడా కాపీయేనా..? ఏ పాట నుండి అంటే..?

by Mohana Priya

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.

సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

reasons behind the negative talk for bheemla nayak trailer

అంతే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు కూడా వర్కవుట్ అయ్యాయి. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన ఆ మార్పులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఒరిజినల్ సినిమా కంటే తెలుగు సినిమా దాదాపు 30 నిమిషాల నిడివి తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల సినిమా క్రేజ్ ఇంకా పెరగడంతో ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. మళ్లీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతో అంత పెద్ద హిట్ పడింది అని అంటున్నారు.

reasons behind the negative talk for bheemla nayak trailer

ఇవన్నీ మాత్రమే కాకుండా భీమ్లా నాయక్ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో ఒక చోట వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే చోట నుండి ఇన్స్పైర్ అయ్యి ట్యూన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు మ్యూజిక్‌లు దాదాపు ఒకటే లాగా ఉన్నాయి. దాంతో ఈ ట్యూన్ కూడా వేరే చోట నుండి ఇన్స్పైర్ అయ్యి చేశారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

https://www.instagram.com/reel/CajlvBEJuvQ/?utm_medium=copy_link

You may also like