Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటించారు. నిత్యా మీనన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించారు. అయితే వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటి సారి.
Video Advertisement
సినిమా రీమేక్ అయినా కూడా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల అయిన తర్వాత రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది.
కొంతమంది బాగుంది అంటే మరికొంతమంది మాత్రం ఒరిజినల్ సినిమాకి సంబంధం లేదు అని అన్నారు. కానీ ఈ సినిమా దాదాపు ఒరిజినల్ సినిమాలాగానే ఉంటుంది. స్టొరీ లైన్ పెద్దగా మార్చలేదు. కానీ పవన్ కళ్యాణ్ పాత్రకి తగ్గట్టు కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక మీమ్ వైరల్ గా మారింది. మరి ఇక దాని కోసం చూస్తే.. బుక్ మై షో లో వివి వినాయక్ ని భీమ్లా నాయక్ సినిమాలో యాక్టర్ గా చూపిస్తోంది.
సాధారణంగా ఏదైనా చిన్న తప్పు దొరికినా సరే మీమ్స్ తెగ వస్తూ ఉంటాయి అలాంటిది ఏకంగా డైరెక్టర్ ని యాక్టర్ గా చేసేసారు. ఇంత పెద్ద తప్పు కనపడితే ఊరుకుంటారా..? మరి మీమ్స్ రావా..? బుక్ మై షో లో వివి వినాయక్ ని డైరెక్టర్ గా కాకుండా యాక్టర్ గా చూపించడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యో బుక్ మై షో చూసుకోవాలి కదా అంటూ ఆ మీమ్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
End of Article