Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ అల్ ఇండియా రికార్డు కూడా సాధించింది. ఈ సినిమా పై హోప్స్ ఒక్కసారిగా పీక్స్ లోకి తీసుకెళ్లింది.
Video Advertisement
Bheemla Nayak release date
అయితే ఈ సినిమా లోని దగ్గుబాటి రాణా లుక్ ని ఇంత వరకు విడుదల చేయలేదు. ఈ సినిమా ని సంక్రాంతి కానుకగా తీసుకువరాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పవన్ బిజీ షెడ్యూల్ వలన ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల లిస్ట్ కూడా పెద్దగా ఉండటం తో థియేటర్స్ కూడా తగినన్ని స్క్రీన్స్ అడ్జస్ట్ అవుతాయా లేదా అన్నది ప్రశ్నర్థకంగా మారింది.
Bheemla Nayak photos
అందుకే ఈ సినిమా ని శివరాత్రికి వాయిదా వేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు ‘భీమ్లా నాయక్ ‘ సినిమా టైటిల్ ఇదే ఫైనల్ కాదని ఒకవేళ మార్చాల్సి వస్తే ‘భీమ్లా నాయక్’ vs డానియల్ శేఖర్ గా మారుస్తారని తెలుస్తుంది.
End of Article