Home Filmy Adda Bheemla Nayak: “భీమ్లా నాయక్” సినిమా కి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

Bheemla Nayak: “భీమ్లా నాయక్” సినిమా కి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

by Megha Varna

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలంటే చాలా విషయాలపై శ్రద్ధ పెట్టాలి. టైటిల్స్ సినిమా సక్సెస్ లో సగభాగం అవుతాయని అందరికీ తెలుసు.

టైటిల్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని మేకర్స్ అనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఒక టైటిల్ అనుకుని మళ్ళీ టైటిల్ ని మార్చుతూ ఉంటారు. అలానే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా టైటిల్ ని కూడా మొదట ఒక పేరు అనుకుని దాని తర్వాత మార్చి ఈ టైటిల్ పెట్టారు.

Pawan Kalyan watches Bheemla Nayak footage, shares handwritten note - Movies News

మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ కి రీమేక్ గా ఈ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ముందు అసుర సంధ్య వేళలో అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ తర్వాత ఈ టైటిల్ అంత బాగా కనెక్ట్ అవ్వదేమో అని నిర్మాతలు మార్చడం జరిగింది. ఫైనల్ గా భీమ్లా నాయక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

You may also like