Ads
సాధారణంగా మన సినిమాల విషయంలో చాలా మంది సినీ ప్రముఖులు హాలీవుడ్ సినిమాలని స్ఫూర్తిగా తీసుకొని ఆ సాంకేతిక విలువలు ఇక్కడ కూడా తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. హాలీవుడ్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతాయి. వాటికి కేవలం హాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా గుర్తింపు వస్తుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో అవతార్ ఒకటి.
Video Advertisement
అవతార్ సినిమాని మన భారతదేశంలో ఎంతో మంది ప్రముఖులు బాగుంది అని అన్నారు. మొదటి భాగం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండవ భాగం విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
సినిమా ప్రీమియర్ షోను చూసిన ఎంతో మంది ప్రముఖులు సినిమా చాలా బాగుంది అని అన్నారు. అయితే ఇవాళ మాత్రం సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ క్రమంలో ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ సినిమా గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ కి వచ్చిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా గురించి నాగ వంశీ మాట్లాడుతూ, “సముద్ర జీవశాస్త్ర డాక్యుమెంటరీని (మరైన్ బయోలజీ డాక్యుమెంటరీ) చూడమని జేమ్స్ కామెరాన్ చెప్పినట్టు ఉంది. ఇది ఒక త్రీడీ సినిమా కాబట్టి అది కూడా జేమ్స్ కామెరాన్ సినిమా కాబట్టి సినిమాను చూసిన వాళ్లందరూ “విజువల్ స్పెక్టాకిల్”! “మాస్టర్క్రాఫ్ట్” మరియు “బ్లాక్బస్టర్” అని మాత్రమే చెప్పాల్సి ఉంది. ఒకవేళ వేరే ఏమైనా చెప్తే ఒప్పుకోరు” అని కామెంట్ చేశారు.
దీంతో చాలా మంది నెటిజన్లు, “ఈ సినిమాని అందరూ అంత బాగుంది అంటూ ఉంటే, మీరు మాత్రం ఇలా అన్నారు ఏంటి?” అని అన్నారు. మరికొంత మంది మాత్రం, “ఇలా మీరు అనుకున్నది ఉన్నది ఉన్నట్లు చెప్పడం చాలా గ్రేట్” అని అన్నారు. ప్రస్తుతం అయితే అవతార్ టు సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమాకి మొత్తంగా ఐదు భాగాలు ఉంటాయి అని అన్నారు.
End of Article