గోవాలో సరికొత్త బిజినెస్ మొదలుపెట్టిన సీనియర్ హీరోయిన్..

గోవాలో సరికొత్త బిజినెస్ మొదలుపెట్టిన సీనియర్ హీరోయిన్..

by Mounika Singaluri

Ads

యువకుడు మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన యాక్టర్ భూమిక. అందమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ బ్యూటీ అప్పట్లో ఎందరో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

Video Advertisement

ఒక్కడు ,సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నా కానీ ఆఫర్స్ మాత్రం ఊహించిన రేంజ్ లో రాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన భూమిక రీసెంట్గా తిరిగి మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో అతని వదిన పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

ప్రస్తుతం కంటెంట్ను పట్టి స్పెషల్ రోల్స్ చేస్తూ తన సత్తాను చాటుకుంటుంది భూమిక. ఇక సినీ సెలబ్రిటీలు యాక్టింగ్ తో పాటు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త బిజినెస్ మొదలు పెడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో చైన్ ఆఫ్ రెస్టారెంట్ ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. భూమిక కూడా అదే ఫాలో అవుతూ గోవాలో ఓ కొత్త రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఈ విషయం గురించి స్వయంగా తన ఇంస్టాల్ అకౌంట్ లో వెల్లడించిన భూమిక.. గోవాలో మా కొత్త వెంచర్.. అంటూ సమర వెల్నెస్ హోటల్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె పోస్టుకు స్పందించిన అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ కూడా కన్వె చేశారు. ప్రస్తుతం భూమిక కంగనా ఎమర్జెన్సీ మూవీలో నటిస్తోంది.


End of Article

You may also like