Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేసిన వాళ్లలో భూమిక చావ్లా ఒకరు. ఎంఎస్ ధోని సినిమాలు సుశాంత్ కి అక్క గా నటించారు. సుశాంత్ చనిపోయిన తర్వాత తన బాధను వ్యక్తం చేస్తూ భూమిక ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు సుశాంత్ కి వీడ్కోలు చెబుతూ మరొక సందేశం రాశారు.
Video Advertisement
“నువ్వు చనిపోయి 20 రోజులు అయ్యింది. రోజు మొదలైనప్పటి నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మనిద్దరం కేవలం కొన్ని సీన్లు మాత్రమే కలిసి నటించాం కానీ ఎంతో మంచి స్నేహితులమయ్యాం. నువ్వు చనిపోవడానికి కారణం డిప్రెషనా? లేదా ఏదైనా వ్యక్తిగత విషయమా? ఒకసారి నాతో మాట్లాడి ఉండాల్సింది కదా?లేదా ఎవరితో అయినా నీ బాధను చెప్పుకోవాల్సింది కదా?
ఒకవేళ ప్రొఫెషనల్ ఇబ్బందులు అనుకుంటే, ఇంత తక్కువ సమయంలో ఇన్ని మంచి సినిమాలు చేసావు. అవును నిజమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. నేను ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ గురించి లేదా బయటి నుండి వచ్చిన వాళ్ల గురించి అని వేరు గా మాట్లాడటం లేదు. ఇండస్ట్రీ అన్న తర్వాత ఎవరికైనా పేరు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. నేను 50 కంటే ఎక్కువ సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ అవకాశాల కోసం నేను వెళ్లాల్సిందే తప్ప అవి నా దగ్గరికి రావు.
అయినా సరే ఏదో ఒక విధంగా నాకు పని లభిస్తున్నందుకు నేను దేవుడికి ధన్యవాదాలు చెబుతాను. పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఎక్కడో కొంత మంది మాత్రమే ఈ పాత్రకి మీరైతే సరిగ్గా సరిపోతారు అని వచ్చే వాళ్ళు ఉంటారు. గుర్తింపు తెచ్చుకోవాలంటే మనమే వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించాలి. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు అనుకున్న విధంగా మాట్లాడరు.
కానీ దానివల్ల మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వ్యక్తిగత జీవితం కావచ్చు లేదా ప్రొఫెషనల్ పరమైన కారణం అయినా కావచ్చు కానీ చివరిగా నేను చెప్పేది ఒక్కటే ముంబై నగరం ఎంతోమంది కి తాము కన్న కలలను నిజం చేస్తుంది, ఎందరికో పేరు కూడా తెస్తుంది, ఒకసారి నీ చుట్టూ లక్ష మంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నావనే భావనను కలిగిస్తుంది.
కారణమేదైనా నువ్వు ఎవరో ఒక్కరితో అయినా నీ బాధను పంచుకోవాల్సింది.నీకు చివరిసారిగా వీడ్కోలు చెబుతూ నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని భూమిక ఆ పోస్టులో పేర్కొన్నారు.
End of Article