ఈ రోజు సాయంత్రం 6 నుండి “బిగ్ బాస్ – 4” స్టార్ట్…వైరల్ అవుతున్న 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్.!

ఈ రోజు సాయంత్రం 6 నుండి “బిగ్ బాస్ – 4” స్టార్ట్…వైరల్ అవుతున్న 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్.!

by Megha Varna

Ads

ఈ లాక్ డౌన్ సమయంలో సీరియల్స్ లేక, మొదలైనవి కూడా మళ్లీ ఆగిపోయి, రిపీటెడ్ ఎపిసోడ్ లతో, చాలా మందికి బోర్ కొడుతోంది. వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసిన కొత్త షోస్ కూడా ఏవి అంతగా అలరించలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఎడారిలో ఒక్క చినుకు వర్షం పడినట్టు సడన్ గా  మా టీవీ యాజమాన్యం బిగ్ బాస్ ఫోర్ ప్రోమో విడుదల చేసింది. ఈ రోజు (6 సెప్టెంబర్) సాయంత్రం 6 నుండి షో మొదలవబోతుంది.

Video Advertisement

అసలు మామూలుగానే బిగ్ బాస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అది కూడా ఇలాంటి సమయంలో షో స్టార్ట్ అయితే ఇంక టి ఆర్ పి ఏ రేంజ్ లో ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. గత సీజన్ లో తన హోస్టింగ్ తో అలరించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వారం వారం కంటెస్టెంట్ ల పనిపట్టే బాధ్యతను తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ లు వీరే అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్న కొంత మంది సెలబ్రిటీలు స్పందించి వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అని చెప్పారు. తర్వాత కూడా ఎంతో మంది పేర్లు వినిపించడం మళ్లీ వాళ్లు అసలు ఆ వార్తలన్నీ పుకార్లు అని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్ మొదలవడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ అని కొంత మంది సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.

#1 అమ్మ రాజశేఖర్ – కొరియోగ్రాఫర్, డైరెక్టర్

#2 లాస్య – యాంకర్

#3 మెహబూబ్ – యూట్యూబర్

#4 దేవి నాగవల్లి – యాంకర్

#5 విశ్వ రఘు – కొరియోగ్రాఫర్ &  ప్రణవి – సింగర్

#6 నోయల్ – సింగర్, యాక్టర్

#7 జబర్దస్త్ అవినాష్ – యాక్టర్

#8 కరాటే కళ్యాణి – యాక్టర్

#9 గంగవ్వ – యూట్యూబర్ (మై విలేజ్ షో)

#10 సుజాత – యాంకర్ (జోర్దార్ వార్తలు)

#11 మోనాల్ గజ్జర్ – సుడిగాడు ఫేమ్

#12 అరియనా గ్లోరీ – యాంకర్

 

#13 సయ్యద్ సోహెల్ – యాక్టర్ (కృష్ణవేణి సీరియల్ ఫేమ్ )

#14 అలేఖ్య హారిక – యూట్యూబర్ (దేత్తడి)

#15 దివి వడ్త్య – మహర్షి ఫేమ్

#16 అభిజిత్ – లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్

ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే. నిజంగానే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వీళ్లేనా? లేదా మళ్ళీ వీళ్లు కూడా ” మేము బిగ్ బాస్ కి వెళ్లట్లేదు” అని చెప్తారా? దాదాపు అందరికీ ఇదే అనుమానం వస్తుంది.

వీళ్ళు నిజంగానే బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ అయ్యుండొచ్చు. లేదా కాకపోయి ఉండవచ్చు. స్టార్ మా లో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ మొదలయ్యేంతవరకు, కింగ్ నాగార్జున కంటెస్టెంట్ లను ఎనౌన్స్ చేసేంతవరకు ఈ లిస్ట్ మారుతూనే ఉంటుంది. లిస్ట్ లో రఘు మాస్టర్ పేరు ఉంది. కానీ తాను బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అని క్లారిటీ ఇచ్చారు రఘు మాస్టర్. గతంలో హీరోయిన్ శ్రద్ధ దాస్ కూడా తాను బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు లిస్ట్ లో నటి సురేఖ వాణి , సింగర్ సునీత పేర్లు కూడా వినిపించాయి. కానీ తాము బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు.


End of Article

You may also like