తన బావని చూడకూడని స్థితిలో చూశానంటూ కన్నీరు పెట్టుకున్న అరియానా..!!

తన బావని చూడకూడని స్థితిలో చూశానంటూ కన్నీరు పెట్టుకున్న అరియానా..!!

by Sunku Sravan

Ads

ప్రస్తుతం సోషల్ మీడియాలో తనదైన శైలిలో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంతో పాపులర్ అయిన బ్యూటీ అరియానా. ఆమె తన అందాలతోనే కాకుండా తన మాటలతో కూడా మెస్మరైజ్ చేస్తుంది. ఈ బ్యూటీ రాంగోపాల్ వర్మ ద్వారా సోషల్ మీడియాలో చాలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ లో ఈ బ్యూటీ పర్ఫామెన్స్ స్టైల్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

Video Advertisement

దీంతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అరియానా అనేక అవకాశాలతో చాలా షో లలో నటిస్తూ విజయవంతంగా ముందుకు పోతుంది. అయితే ఆమె ఆ మధ్య కాలంలో ఆర్జీవి తో జిమ్లో వర్కవుట్ చేస్తూ చాలా గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం నాన్ స్టాప్ గా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ లో కూడా ఆమె తన పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. అందులో భాగంగానే ఈ మధ్యనే ఒక సెన్సేషనల్ విషయాన్ని చెప్పింది.

 

తన బావతో ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాన్ని గుర్తు చేసుకుంది. దాన్ని గుర్తు చేసుకుంటూ బోరున విలపించింది. తన బావ తనని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని చెప్పింది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తన బావతో ప్రేమలో పడిందట. వయసు పెరుగుతున్నకొద్దీ ఆయనపై ప్రేమను కూడా పెంచుకుంది.

అయితే అరియానా బావకు డిగ్రీ పూర్తిచేశాక హైదరాబాద్ లో జాబ్ కూడా వచ్చింది. ఈమె కూడా ఇంటర్ అయిపోయాక ఇంటిని హైదరాబాదుకు వచ్చి తన బావతో కలిసి ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇలా మూడు సంవత్సరాల పాటు వారి రిలేషన్ కొనసాగిందట. ఆ సమయంలో ఆమె బావ తిన్నావా పడుకున్నావా అంటూ మంచి కేరింగ్ చూపించేవాడని చెప్పుకొచ్చింది. తర్వాత బావకు నేను బోర్ కొట్టేసాను. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది.

ఒకరోజు అనుకోకుండా అతన్ని ఏ అమ్మాయి కూడా చూడకూడని స్థితిలో చూశానని. దీంతో నా గుండె పగిలి పోయిందని, ఇక బావతో కలిసి ఉండడం కుదరదని డిసైడ్ అయ్యాను అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ మా బావ మళ్లీ మాయమాటలు చెప్పి ఒప్పించాడు. మళ్లీ రెండు సంవత్సరాలపాటు రిలేషన్ లో ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఆర్ జే కావాలని మా బావకు చెప్పను. అలా ఆర్ జే గా చేస్తున్న సమయంలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడిందట.

 

దీంతో వాళ్ళ బావ అనుమానించడం మొదలు పెట్టాడు. ఇక అనుమానం పెనుభూతం గా మారింది. నావల్ల కాలేదు బ్రేకప్ చెప్పాను అంటూ అరియనా పేర్కొంది. ఆ తర్వాత కూడా బావ చాలా సార్లు గుర్తొచ్చాడు అని, ఎలాగైనా బావతో కలుసుకోవాలని ప్రయత్నం చేశాను. నేను సంపాదిస్తున్న కాబట్టి బావకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని, ఆయనకు నచ్చిన మంచి చీర కట్టుకొని వెళ్లాను. కానీ బావ నన్ను ఛీ పొమ్మన్నాడు. కానీ ఇప్పుడు మా బావ మనసు మార్చుకొని నా దగ్గరికి వచ్చినా నాకు వద్దు అంటూ అరియానా కంటతడి పెట్టుకుంటూ తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది.


End of Article

You may also like