Ads
సీరియల్స్ ద్వారా మనకు పరిచయమయ్యి, బిగ్ బాస్ షో ద్వారా ఇంకా సుపరిచితులు అయ్యారు అఖిల్ సార్థక్. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్స్ చేయడంతో పాటు, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అఖిల్. బిగ్ బాస్ లో గత కొంత కాలంగా అఖిల్ కి, మోనాల్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడడం మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా సోషల్ మీడియాలో అఖిల్, మోనాల్ ప్రేమలో ఉన్నారేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Video Advertisement
కానీ నామినేషన్ ప్రక్రియ లో అఖిల్, మోనాల్ ని నామినేట్ చేయడం చర్చలకి దారి తీసింది. అఖిల్, మోనాల్ పై వస్తున్న వార్తలకు అఖిల్ తల్లి స్పందించారు. సమయం కథనం ప్రకారం ఈ విషయంపై అఖిల్ తల్లి మాట్లాడుతూ “వారిద్దరిదీ కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళేటప్పుడే ప్రేమ లాంటి వాటికి దూరంగా ఉంటాను అని అఖిల్ మాటిచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది మధ్యే ఉంటున్నాడు. కాబట్టి ఉన్న వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నాడు. అంతే కానీ ప్రేమ లాంటిది ఏమీ లేదు.
అయినా ఒకవేళ ప్రేమ అయితే అఖిల్ మోనాల్ ని ఎందుకు నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ మనసులో ఎవరున్నారో తెలుసుకొని పెళ్లి చేస్తాం. ఒకవేళ మోనాల్ అయితే మాత్రం చేయలేము. ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్య వయసు తేడా కూడా ఉంది. అందుకే కష్టం. అయినా వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు” అని అన్నారు.
అఖిల్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ ” అఖిల్ సీరియల్స్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించాడు. కాబట్టి బిగ్ బాస్ లో కూడా అలానే కనిపిస్తున్నాడని, అది తన రియల్ క్యారెక్టర్ కాదు. తను హీరో. ఏదేమైనా అఖిల్ టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటాడు. అందులో సందేహమే లేదు” అని అన్నారు.
End of Article