SHOBHA SHETTY: స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన శోభా శెట్టి… నిజంగా చాలా లక్కీ…!

SHOBHA SHETTY: స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన శోభా శెట్టి… నిజంగా చాలా లక్కీ…!

by Mounika Singaluri

Ads

శోభా శెట్టి బుల్లితెర పైన కార్తీకదీపం సీరియల్ తో చాలా ఫేమస్ అయింది. ఆ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటించి తెలుగు రాష్ట్రాల్లో అందరి మనన్నలు పొందింది. అయితే తాజాగా శోభా శెట్టి బిగ్ బాస్ లోకి ఎంటర్ అయింది. బిగ్ బాస్ లో మంచి ప్రదర్శన తన ఆటతీరుతో ఎక్కువ రోజులు కొనసాగింది. టాప్ ఫైవ్ లో కొనసాగుతుంది అనుకున్న శోభా శెట్టి 14 వారంలో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది .

Video Advertisement

బిగ్ బాస్ లో ఉన్నంతకాలం జనాల్ని బాగా ఎంటర్టైన్ చేసింది. బిగ్ బాస్ షో కి మంచి రేటింగ్ పెరగడానికి శోభా శెట్టి ఎంతగానో హెల్ప్ అయింది. తనకి సంబంధం లేని విషయాల్లో తల దూర్చడం నలుగురితో గొడవ పెట్టుకోవడం, యాంటీగా ఉన్న వారిని టార్గెట్ చేయడం మళ్ళీ ఏదోలాగా సేవ్ అవడం ఇలా ఎన్ని రోజులు కొనసాగింది. కానీ ఎలిమినేట్ అయ్యాక స్టేజి మీద ఏడ్చేసిన శోభా శెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ అమ్మడికి మంచి మంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయట.

ఇప్పుడు ఈమె మంచి బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . చిరంజీవి సినిమాలో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. మెగా 156 సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ వశిష్ట అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది బిగ్ బాస్ టైటిల్ కంటే కూడా మంచి గిఫ్ట్ అండ్ టు శోభా శెట్టి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 


End of Article

You may also like