బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయ్యింది కంటెస్టెంట్స్ కూడా ఎవరి ఆటను వారు తమ ప్రదర్శన తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లని ప్రవేశపెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక ఆట విషయానికి వస్తే ఆటలో తాము ఎలాగైనా గెలవాలని, ఆకట్టుకోవాలని ఎవరికి వారు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ఉంటారు.

rj-kajal-images

rj-kajal-images

అయితే ఎవరి ఆట వారిదే. అలా అడుగు పెట్టిన వారిలో ఒకరు ఆర్జే కాజల్ తనకి ఈ షో అంటే ఎంతో ఇష్టమని చెప్పుకుంటూ వచ్చింది అంతే తెగ ఎమోషనల్ కూడా అయ్యింది. బిగ్ బాస్ షో కోసం ముందుగానే సిద్దమై వచ్చిన ఆర్జే కాజల్. తన ఆటని అందరిని ముందుగానే పసిగట్టేస్తున్నారు కంటెస్టెంట్స్, ఆడియెన్స్ దీనితో సోషల్ మీడియా లో ట్రోల్ కి టార్గెట్ అవుతుంది. అందు కారణం చేతే సోమవారం నాటి షో లో నామినేట్ చేసారు.

Bigg Boss 5 Telugu Contestant RJ Kajal

Bigg Boss 5 Telugu Contestant RJ Kajal

ఇక ఆమె గేమ్ షో కూడా అన్ని సింపతీ కోసమే చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. తనను నామినేట్ చేసారు కాబట్టే సరయు, ప్రియలను కూడా నామినేట్ చేస్తునట్టు చెప్పింది. తన డ్రీం షో బిగ్ బాస్ కి అడ్డుపడుతున్నారు అని కూడా అన్నది. ఇలాగె గత సీజన్ లో శ్రీముఖి కూడా ఇలాంటి ఆటనే ప్రదశించిందంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అలంటి ఆటనే ఆర్జే కాజల్ కూడా చేస్తుందని అంటున్నారు నెటిజన్స్.