అక్కినేని ఫ్యామిలీతో బిగ్ బాస్ కంటెస్టెంట్ “అభిజీత్” కి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?

అక్కినేని ఫ్యామిలీతో బిగ్ బాస్ కంటెస్టెంట్ “అభిజీత్” కి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ షోలో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నాకూడా, ఫోకస్ మాత్రం కొంతమంది పై మాత్రమే ఉంటుంది. అలా ప్రస్తుతం బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో అభిజిత్ ఒకరు. అంతకుముందు అభిజిత్ మనందరికీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో గా తెలుసు. కానీ ఈ షో ద్వారా అభిజిత్ నిజ జీవితంలో ఎలా ఉంటారో మనం చూస్తూ ఉన్నాం.

Video Advertisement

అక్టోబర్ 11వ తేదీన పుట్టిన అభిజిత్ కిండర్ గార్డెన్ వరకు  చైతన్య విద్యాలయ లో చదివారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కినేని అఖిల్ కూడా చైతన్య విద్యాలయ లోనే చదివారట. అభిజిత్ ప్రైమరీ, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ మదనపల్లిలో ఉన్న రిషి వాలీ స్కూల్లో చదివారట.

హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు శేఖర్ కమ్ముల అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు అభిజిత్ ఫోటోలని ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ లో చూసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని అడిగారట. అలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అభిజిత్. ఈ సినిమాలో అమల అక్కినేని కొడుకు పాత్రలో నటించారు అభిజిత్.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత గూడచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అరెరే సినిమాలో నటించారు. మిర్చి లాంటి కుర్రాడు, రామ్ లీలా సినిమాల్లో కూడా నటించారు అభిజిత్. పెద్ద స్క్రీన్ పై మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ పై కూడా పెళ్లి గోల వెబ్ సిరీస్ లో కనిపించారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో ద్వారా మనందరికీ ఇంకా చేరువయ్యారు అభిజిత్.


End of Article

You may also like