బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో అలేఖ్య హారిక ఒకరు. టాస్క్ లో యాక్టివ్ గా ఉంటూ, సూటిగా తను అనుకున్నది మాట్లాడుతూ, స్ట్రైట్ ఫార్వర్డ్ గా తన గేమ్ తను ఆడుతూనే, మిగిలిన కంటెస్టెంట్స్ తో కూడా మంచి రిలేషన్ షిప్ ఏర్పరుచుకున్నారు అలేఖ్య హారిక.

అలా హౌస్ బయట మాత్రమే కాకుండా హౌస్ లోపల కూడా మంచి పేరు సంపాదించుకున్నారు అలేఖ్య హారిక. బిగ్ బాస్ కి రాకముందు దేత్తడి ఛానల్ ద్వారా అలేఖ్య హారిక చాలా మందికి తెలిసే ఉంటారు.

stills from naa pilla short film

యూట్యూబ్ లో  దేత్తడి ఛానల్ ద్వారా మనకి పరిచయం అవ్వక ముందు అలేఖ్య హారిక అమెజాన్ లో ఒక మంచి పొజిషన్ లో ఉద్యోగం చేసే వారట. నటన అంటే ఆసక్తితో ఈ రంగం వైపు వచ్చారట. కవర్ సాంగ్స్, అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారట అలేఖ్య హారిక.

అలేఖ్య హారిక యూట్యూబ్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా కనిపించారు. కానీ తెలుగు సినిమా లో కాదు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో  డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ లో  ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు.

ఇంక బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్ లో అలేఖ్య హారిక తో పాటు లాస్య, దేవి నాగవల్లి, అరియానా గ్లోరీ, మెహబూబ్, కుమార్ సాయి, మోనాల్ గజ్జర్ ఉన్నారు. ప్రస్తుతం ఇంటి సభ్యులు అందరూ మనుషులు, రోబో అనే రెండు గ్రూప్స్ గా విడిపోయి టాస్క్ చేస్తున్నారు. బుధవారం ఎపిసోడ్ లో రెండు గ్రూప్ సభ్యుల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.