ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు. అలాగే ముందుగా ఎంపిక చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ల లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో చివరి నిమిషంలో వాళ్లని వేరే కంటెస్టెంట్స్ రీప్లేస్ చేశారు అనే వార్త కూడా ప్రచారం అవుతోంది.

ఏదేమైనా ఇవన్నీ తెర వెనక విషయాలు కాబట్టి వీటి గురించి అధికారికంగా షో యాజమాన్యం ఎవరూ మాట్లాడరు. కంటెస్టెంట్లు అందరూ వేరు వేరు బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారు. వాళ్లని మనం తెరపై చూడటం తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఆ వ్యక్తి బయటికి చెప్పేంత వరకు ఎవరికీ తెలియదు.  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ముందు నుండి వినిపించిన పేరు అరియానా గ్లోరీ.

అరియానా గ్లోరీ అసలు పేరు అది కాదు అని ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో నాగార్జున అన్నారు. తన అసలు పేరు చెప్పడానికి భయపడతాను అని అరియానా గ్లోరీ చెప్పారు. సమయం కథనం ప్రకారం ఇంతకీ అరియానా గ్లోరీ అసలు పేరు ఏంటంటే అర్చన. జనవరి 25వ తేదీన పుట్టిన అరియానా గ్లోరీ వికారాబాద్ లోని తాండూర్ లో పెరిగారు.

తర్వాత హైదరాబాద్ లో యాంకరింగ్ అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. 2015 లో స్టూడియో వన్ ఛానల్ లో యాంకర్ గా చేరారు అరియానా గ్లోరీ. ఆ తర్వాత ఈ టీవీ అభిరుచి లో కూడా యాంకర్ గా చేశారు, 2017 నుండి జెమినీ కామెడీ లో యాంకర్ గా కొనసాగుతున్నారు అరియానా గ్లోరీ.

టీవీ ఛానల్స్ లో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఫ్రీలాన్సర్ గా యాంకరింగ్ చేస్తారు అరియానా గ్లోరీ. రాంగోపాల్ వర్మతో తను చేసిన ఇంటర్వ్యూ ద్వారా అరియానా గ్లోరీ మరింత గుర్తింపును సంపాదించుకున్నారు. అరియానా గ్లోరీ దాదాపు 500 సెలబ్రిటీల ని ఇంటర్వ్యూ చేశారు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో ఉన్నారు అరియానా గ్లోరీ.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com