Ads
బిగ్ బాస్ తెలుగు 5 రియాల్టీ గేమ్ షో ఇక చివరికి రాబోతోంది. మరి కొన్ని వారాల్లో ఫైనాలీ ఎపిసోడ్ కూడా రాబోతోంది. 11 వారాలు ఇప్పటికే గడిచిపోయాయి. ప్రస్తుతం టాప్ 5 పొజిషన్ల కోసం పోటీ పడుతున్నారు కంటెస్టెంట్లు. అయితే వీళ్ళల్లో మానస్ నాగులపల్లి ప్రత్యేక ఆకర్షణగా మారారు.
Video Advertisement
తన ఆటతో, బాడీ లాంగ్వేజ్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు మానస్. మరో పక్క మెగా ఫ్యాన్స్ కూడా అభిమానాన్ని కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా మానస్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దాని కోసం చూస్తే…
బిగ్ బాస్ లో ఉత్తమ విలువలను అనుసరిస్తున్న మానస్ కి మెగా ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. చిరుకి సంబంధించి ఫాన్స్ గ్రూప్ లో మానస్ గురించి మంచిగా కామెంట్లు చేస్తున్నారు. మానస్ చిన్నతనంలో చిరంజీవిని కలిసిన ఫోటోను షేర్ చేసి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే మానస్ మరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఉంటారా లేదా అనేది చూడాలి.
End of Article