Home Bigg Boss 4 Telugu ఆయన చనిపోయారు, చెప్పకుండా దాచారు అంటూ… తను బిగ్ బాస్ హౌస్ లో ఉండగా జరిగిన విషాద ఘటనను బయటపెట్టిన దివి.!

ఆయన చనిపోయారు, చెప్పకుండా దాచారు అంటూ… తను బిగ్ బాస్ హౌస్ లో ఉండగా జరిగిన విషాద ఘటనను బయటపెట్టిన దివి.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ లో ఏడు వారాల వరకు మనల్ని అలరించిన దివి, అంతకు ముందు వారం ఎలిమినేట్ అయ్యారు. దివి ఎలిమినేట్ అవుతారు అని ఎవరు ఊహించి ఉండరు. దివి ఒక మోడల్. దివి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన దివి కి యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో నటన వైపు దృష్టి పెట్టారు. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడం మొదలు పెట్టారు. వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

Video Advertisement

ఆ తర్వాత మహర్షి సినిమా లో మహేష్ బాబు క్లాస్ మేట్ గా నటించారు. సినిమాలో కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా బాగా రిజిస్టర్ అయ్యారు. దివి చదువుకున్న చదువు ఒకటి తను ఎంచుకున్న రంగం ఒకటి. తనకి సినిమాలంటే చాలా ఇష్టం ఉండడంతో ఈ రంగం వైపు రావాలి అనుకున్నారు.

దివి తను సినిమాల్లోకి వెళ్తాను అంటే ఇంట్లో వాళ్ళు ముందు ఒప్పుకోలేదు. తర్వాత వాళ్లని కూర్చోబెట్టి మొత్తం చెప్తే అప్పుడు అర్థం చేసుకున్నారు. దివి వాళ్ల తండ్రికి కూడా నటించడం అంటే చాలా ఇష్టం. దివి వాళ్ళ తాతయ్యకి జగ్గయ్య గారితో కలిసి నటించే అవకాశం వచ్చిందట, కాకపోతే దివి వాళ్ల తాతయ్య వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడంతో సినిమాలో నటించేలేకపోయారట.

దివిని వాళ్ల తాతయ్య బాగా ప్రోత్సహించారట. కానీ దివి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారంలోనే వాళ్ల తాతయ్య చనిపోయారు. ఈ విషయం తెలిస్తే దివి బాధపడతారు అని తనకి చెప్పలేదు. దివి బిగ్ బాస్ హౌస్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ ని తాతయ్య ఎక్కడ అని అడిగితే ఏడ్చారట. ఫస్ట్ నామినేషన్ అయినప్పుడు ఆయన చనిపోయారు. తన తాతయ్య తన గెలుపు కోసం ఎప్పుడూ ప్రే చేస్తూ ఉండేవారు అని, ఇవన్నీ చూసి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు అని దివి అన్నారు.


End of Article

You may also like