గతంలో ఎన్నోసార్లు వినాయక విగ్రహం పాలు తాగుతుంది అని..సాయి బాబా పటం నుంచి విబూది రాలుతుందని ఎన్నో సార్లు విన్నాం. ఇవన్నీ ఏమి లేదు అంతా భ్రమే అంటూ కొందరు కొట్టిపడేసారు..కాదు కాదు ఇది దేవుడి లీల అద్భుతం అంటూ దేవుడు ఉన్నాడు అనే మాటకి ఇదే నిదర్శనం అంటూ సపోర్ట్ చేసారు.

Video Advertisement

big-boss-himaja

big-boss-himaja

ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి బిగ్ పేస్ ఫేమ్ హిమజ గారి ఇంట్లో జరిగిందని ఒక వీడియో షేర్ చేసారు హిమజ. 2004 సంవత్సరం తను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక స్వామికి వారి నుంచి ఈ విగ్రహం వచ్చిందని. హోమాలు, పూజలు వంటివి చేసి ఈ విగ్రహాన్ని ఇచ్చారని చెప్పయింది. అప్పటి నుంచి వారి ఇంట్లో ఉన్నవారందరూ సాయి బాబా భక్తులుగా మారారని, ఇక ప్రతి రోజు సాయిబాబాకి పూజ చెయ్యడం దాని శుభ్రం చెయ్యడం వంటి పనులు తానే దగ్గర ఉంది చేసేవారని.

himaja-big-boss

himaja-big-boss

అలా ఒక రోజు సాయి బాబా విగ్రహం చుట్టూ విబూది రాలడం చూశానని చెప్పారు. ఆ విగ్రహం ఒక కబోర్డ్ లో ఉండేదని. ఆ కబోర్డ్ చుట్టూ కూడా విబూది రాలడం గమనించానని ఆ విబూది అగర్బత్తి లాంటి వాసన కూడా వచ్చిందని చెప్పారు ఇది కేవలం తన ఇంట్లో జరిగిన సంఘటన గురించి చెప్పడానికి మాత్రమే వీడియో చేసానని అంతేకాని నమ్మించడానికి కాదని మరీ చెప్పారు.