ఈ నటి చెప్పింది బాలకృష్ణ సినిమా గురించేనా… రూమ్ కి వెళ్ళను అనడంతో..? అసలు విషయం ఏంటంటే..?

ఈ నటి చెప్పింది బాలకృష్ణ సినిమా గురించేనా… రూమ్ కి వెళ్ళను అనడంతో..? అసలు విషయం ఏంటంటే..?

by Megha Varna

Ads

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 లో ఇటీవల ఒక కంటెస్టెంట్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఈ కామెంట్స్ కి, ఒక తెలుగు సినిమాకి కూడా సంబంధం ఉండడంతో ఇప్పుడు తెలుగులో కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.

Video Advertisement

వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ లో విచిత్ర అనే ఒక నటి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. విచిత్ర తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించారు. ఇటీవల బిగ్ బాస్ ప్రోగ్రాంలో భాగంగా తనకి ఒక సినిమా సందర్భంలో ఎదురైన సంఘటన గురించి చెప్పారు.

bigg boss tamil season 7 vichithra about a telugu movie

ఈ సంఘటన తర్వాత తనకి అవకాశాలు కూడా పెద్దగా రాలేదు అన్నారు. ఈ విషయం గురించి విచిత్ర మాట్లాడుతూ, “షూటింగ్ మొదటి రోజు హీరో నన్ను తన రూమ్ కి రమ్మన్నారు. నేను వెళ్ళను అని చెప్పాను. దాని తర్వాత నా రూమ్ డోర్ ఎవరో ఒకరు కొడుతూ ఉండేవారు. దీని వల్ల నేను రోజుకి ఒక రూమ్ మారాల్సి వచ్చేది. దాంతో నాకు స్పాట్ లో సినిమా టీం ఒక పాఠం నేర్పించాలి అనుకున్నారు.”

bigg boss tamil season 7 vichithra about a telugu movie

“ఒక సీన్ లో నేను ఒక గుంపుతో గొడవ పడాల్సి ఉంది. అందులో ఒకరు నన్ను ఇబ్బంది పడేలాగా ముట్టుకున్నారు. ఇది నేను స్టంట్ మాస్టర్  కి కంప్లైంట్ చేస్తే ఆ దర్శకుడు నన్ను అందరి ముందు కొట్టారు. కౌన్సిల్ కి చెప్పినా, ఇంకా ఎక్కడ చెప్పినా కూడా నాకు ఎటువంటి మద్దతు అందలేదు.” అని విచిత్ర చెప్పారు. విచిత్ర తమిళ్ సినిమాల్లో కూడా నటించడంతో ఇది తమిళ హీరో అని ఒక పుకారు మొదలయ్యింది.

bigg boss tamil season 7 vichithra about a telugu movie

కానీ విచిత్ర ఈ విషయం గురించి చెప్తూ తనకి తమిళ్ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి సంఘటనలు ఎదురు అవ్వలేదు అన్నారు. దాంతో ఇది తెలుగు ఇండస్ట్రీలో విచిత్ర చేసిన సినిమా సమయంలోనే జరిగింది అని అన్నారు. ఈ సంఘటన 2001 లో జరిగింది అని విచిత్ర చెప్పినట్టు సమాచారం. అయితే 2001 లో విచిత్ర తెలుగులో భలేవాడివి బాసు అనే సినిమాలో నటించారు.

bigg boss tamil season 7 vichithra about a telugu movie

ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. బాలకృష్ణ కెరీర్ లో డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. విచిత్ర చెప్పిన సీన్ కూడా ఈ సినిమాలో ఉంది. ఒక సీన్ లో విచిత్ర అంజలా జవేరితో పాటు కొంత మందిని రాళ్లు వేసి కొట్టి, తర్వాత ఒక గుంపు జనాలపై దాడి చేస్తారు. దాంతో విచిత్ర ఈ సినిమా గురించి చెప్పారు అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి.

watch video :

మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం తెలీదు. విచిత్ర ఈ సినిమా గురించి చెబుతూ దీని వివరాలు చెప్పాలి అనుకోవట్లేదు అని అన్నారు. దాంతో ఇవన్నీ ప్రస్తుతం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ విచిత్ర చెప్పిన చాలా విషయాలు ఈ సినిమాకి దగ్గరగా ఉండడంతో, అది కూడా తమిళ్ ఇండస్ట్రీలో తనకి ఇలాంటి సంఘటనలు ఎదురు అవ్వలేదు అని చెప్పడంతో తెలుగు సినిమా గురించే చెప్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

watch video : 

ALSO READ : వామ్మో సునీల్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా….! బాగా ఎక్కువ..!


End of Article

You may also like