Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5 : “ఫైనలిస్ట్ తనే.!” అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిన నాగార్జున.! ఇంతకీ ఎవరంటే.?

Bigg Boss Telugu-5 : “ఫైనలిస్ట్ తనే.!” అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిన నాగార్జున.! ఇంతకీ ఎవరంటే.?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలై ఇప్పటికీ మూడు వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన మూడు నామినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో లహరి ఎలిమినేట్ అయ్యారు.bigg boss telugu 5 confirmed finalist

గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా విన్నర్ ఎవరవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున ఇటీవల ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైనలిస్ట్ ఆ కంటెస్టెంట్ అంటూ చెప్పకనే చెప్పేశారు.  శనివారం జరిగిన ఎపిసోడ్ గమనిస్తే, అందులో నాగార్జున రవి, లహరి, ప్రియకి మధ్య జరిగిన చర్చ గురించి మాట్లాడారు.bigg boss telugu 5 confirmed finalist

ప్రియ దగ్గర ఒక మాట, లహరి దగ్గర ఒక మాట మాట్లాడినందుకు రవిపై సీరియస్ అయ్యారు. ఒకసారి మనం గత బిగ్ బాస్ గమనిస్తే, అందులో ఫైనల్ విన్నర్ అయిన అభిజిత్ పై మోనాల్ విషయంలో కూడా ఒక ఎపిసోడ్ లో నాగార్జున ఇలాగే సీరియస్ అయ్యారు. ఇప్పుడు అదే సంఘటన మళ్లీ రిపీట్ అయ్యింది. దాంతో విశ్లేషకులు రవి బిగ్ బాస్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రేక్షకులలో కూడా రవిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

You may also like