Home Bigg Boss 5 telugu బిగ్‌బాస్ హమీదా బండారం బయటపెట్టిన నెటిజన్లు.! వైరల్ అవుతున్న ఫోటో.!

బిగ్‌బాస్ హమీదా బండారం బయటపెట్టిన నెటిజన్లు.! వైరల్ అవుతున్న ఫోటో.!

by Mohana Priya

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.ఇక నామినేషన్స్ ప్రక్రియ ప్రతి సీజన్ నుంచి వస్తున్నదే ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.bigg boss telugu 5 hameeda picture going viralఎపిసోడ్స్ గడిచేకొద్దీ షోలో రోజు రోజుకి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క రోజు కంటెస్టెంట్స్ అందరూ బాగా మాట్లాడుకుంటారు. కానీ మళ్లీ కొద్ది రోజులకి గొడవలు మొదలవుతున్నాయి. ఇలా ఇప్పటికీ చాలా కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇలా కొన్ని గొడవలు, కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ మూడవ వారంలోకి అడుగు పెట్టింది. ఇటీవల బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటన చర్చలకు దారి తీసింది.

bigg boss telugu 5 hameeda picture going viral

అయితే హమీదా నామినేషన్ సందర్భంగా ప్రియాంకని నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ హమీదా ఒక రీజన్ చెప్పారు. తనకి మంట అంటే భయం అని వంట చేసేటప్పుడు ప్రియాంక కావాలనే ఎక్కువ మంట పెట్టి వంట చేస్తున్నారు అని ఈ కారణం చేత ప్రియాంకని నామినేట్ చేస్తున్నాను అని చెప్పారు హమీదా. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో హమీదా ఫోటోని నెటిజన్లు లీక్ చేశారు. ఈ ఫోటోలో హమీదా సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ వెలిగిస్తే భయం లేదు కానీ గ్యాస్ లైటర్ వెలిగిస్తే భయమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss Telugu Voting >> Click Here

Bigg Boss Telugu Voting

You may also like