Home Bigg Boss 5 telugu బిగ్‌బాస్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరిచిన కాజల్ ఫ్యాన్ బేస్..? గత వారం ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

బిగ్‌బాస్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరిచిన కాజల్ ఫ్యాన్ బేస్..? గత వారం ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 78 రోజులు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. అయితే, “వారం వారం తన ఆటలో ఇంప్రూవ్‌మెంట్ చూపించిన కంటెస్టెంట్ ఎవరు?” అంటే మాత్రమే అందరి నోటి నుండి ఎక్కువ వచ్చిన సమాధానం కాజల్. కాజల్ ముందు నుండి కూడా గేమ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు.

bigg boss telugu 5 management surprised by kajal voting percentage

తాను గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను అని చెప్తూ వచ్చారు. చెప్పిన విధంగానే కాజల్ ఎక్కువగా గేమ్ మీద, ఆ గేమ్ కి కావాల్సిన స్ట్రాటజీల మీద ఫోకస్ చేస్తున్నారు. దాంతో కాజల్ ఫ్యాన్ బేస్ కూడా అదే విధంగా పెరుగుతూ వెళుతుంది. గతవారం ఓటింగ్ లో సిరి, ప్రియాంకకంటే కూడా కాజల్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాదాపు సమానంగా కాజల్ కి ఓట్స్ వచ్చినట్లు సమాచారం.

You may also like