Home Bigg Boss 5 telugu “నా దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు నన్ను నమ్మావు… నా నిజమైన సక్సెస్ నువ్వే.!” అంటూ “సిరి”కి తన బాయ్ ఫ్రెండ్ రాసిన లెటర్.!

“నా దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు నన్ను నమ్మావు… నా నిజమైన సక్సెస్ నువ్వే.!” అంటూ “సిరి”కి తన బాయ్ ఫ్రెండ్ రాసిన లెటర్.!

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 7 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్‌లో ప్రియ ఎలిమినేట్ అయ్యారు. అయితే నిన్న నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులకి ఉత్తరాలు వచ్చాయి.

bigg boss telugu 5 siri boy friend srihan letter

వాటిలో సిరికి వచ్చిన ఉత్తరం కూడా ఉంది. సిరికి, ప్రముఖ నటుడు, అలాగే సిరి బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహన్ లెటర్ రాశారు. ఇందులో శ్రీహన్ ఈ విధంగా రాశారు, ” సిరి, మన సెవెన్ ఇయర్స్ రిలేషన్ లో ఇన్నిరోజులు నీకు దూరంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మ నాన్న తర్వాత, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, అది నువ్వే సిరి. నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి, నా యాక్టింగ్ కోసం కష్టపడుతున్నప్పుడు మన ఫ్యామిలీ ప్రెజర్ నా వరకు రాకుండా నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు మాత్రమే తెలుసు.”

bigg boss telugu 5 siri boy friend srihan letter

“మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు. కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు. నన్ను ప్రేమించావు. ఒక మాట చెప్పనా? నా నిజమైన సక్సెస్ నువ్వే సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు బాధ పడడం, ఏడవడం నేను చూడలేను. స్ట్రాంగ్ గా ఉండు. బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా ఆడాలి. నీకు నేను చెప్పేది ఒకటే. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చెయ్. నీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ కి కూడా ఆల్ ద బెస్ట్. నువ్వు వచ్చాక పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉందాం. ఐ లవ్ యు సిరి. నీ శ్రీహన్.”

You may also like