Home Bigg Boss 5 telugu Big Boss Telugu-5 : “నా కూతుర్ని చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారు.!” అంటూ…”సిరి” తల్లి కామెంట్స్.!

Big Boss Telugu-5 : “నా కూతుర్ని చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారు.!” అంటూ…”సిరి” తల్లి కామెంట్స్.!

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 78 రోజులు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం టాప్ లో ఉన్న ఇంటిసభ్యులలో సిరి ఒకరు. సిరికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, అంతే నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఈ విషయంపై సిరి తల్లి స్పందించారు.

bigg boss telugu 5 siri mother about negative comments

సమయం కథనం ప్రకారం సిరిపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై సిరి తల్లి మాట్లాడుతూ, “హౌస్ లో గొడవ పడి ఏడుస్తున్నప్పుడు అక్కడ ఎందుకమ్మా వచ్చేసేయ్ అని అనాలనిపిస్తుంది. సిరి బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నిజజీవితంలో కూడా ఎవరితోనూ గొడవ పడదు. తన దగ్గర ఏదైనా ఉంటే పదిమందికి పెట్టే స్వభావం నా నా కూతురిది. టీవీ లో ఏదో ఒకటి చూసి నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదు. ఆమెను చూసి ఓర్చుకోలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు” అని అన్నారు.

bigg boss 5 telugu contestant shanmukh words about deepthi sunaina

ఇక ఈ వారం బిగ్ బాస్ విషయానికి వస్తే, కంటెస్టెంట్స్ తమ ఇంటి సభ్యులని కలుసుకొని మాట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో కాజల్ కూతురు, భర్త వచ్చారు. ఇవాల్టి ఎపిసోడ్ లో శ్రీ రామచంద్ర ఇంటి సభ్యులు, మానస్ తల్లి, షణ్ముఖ్ ఇంటి సభ్యులు, అలాగే సిరి వాళ్ళ తల్లి కూడా షోకి వస్తున్నారు. అంతే కాకుండా, సిరి తల్లి, సిరితో, షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ, “మీరిద్దరూ అలా హగ్ చేసుకోవడం బాలేదు” అని అనడం మనం ప్రోమోలో చూడొచ్చు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యేంత వరకు ఆగాల్సిందే.

You may also like