Home Bigg Boss 5 telugu “ప్రేమకి వయసుతో సంబంధం లేదు.!” అంటూ… “లోబో” పై ఉమాదేవి కామెంట్స్.! (వీడియో)

“ప్రేమకి వయసుతో సంబంధం లేదు.!” అంటూ… “లోబో” పై ఉమాదేవి కామెంట్స్.! (వీడియో)

by Mohana Priya

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి, బిగ్ బాస్ తెలుగు ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులైన వ్యక్తి ఉమా దేవి. ఉమా దేవికి, లోబోకి మధ్య నడిచిన ట్రాక్ అందరికి తెలిసిందే. కానీ అది ప్రేక్షకులకి అంత పెద్దగా నచ్చలేదు అనే చెప్పాలి. ఈ విషయంపై ఉమా దేవి కూడా స్పందించారు.

ఒక ఇంటర్వ్యూలో ఉమా దేవి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. వారిద్దరికి చాలా సంత్సరాల నుండి పరిచయం ఉంది అని చెప్పారు.

bigg boss telugu 5 uma devi about her relationship with lobo

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని, ఏ వయసులో అయినా ప్రేమ కలగవచ్చు అని అన్నారు. కేవలం పిల్లలు ప్రేమించుకోవాలి అనేది నిజం కాదు అని, తాను అయితే లోబోని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పారు. “తనతో నాకు చాలా మంచి బాండింగ్  ఉంది, నేను బయటకు వచ్చిన తర్వాత తనని ఒంటరి చేస్తారు అనే భయం ఉండేది. తొక్కేస్తారు అనే ఫీలింగ్ మొదటి నుంచి ఉంది. లోబోని కించపరిచినట్టు మాట్లాడుతారు ఏమో అని భయం ఉండేది. నేను ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని స్టేజి మీద చెప్పాను.”

bigg boss telugu 5 uma devi about her relationship with lobo

“ఇంటి సభ్యులందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేసేవాడు. మా 18 మందితో పాటు అన్ని కోట్ల మంది నవ్విస్తున్నాడు అంటే అది చిన్న టాలెంట్ కాదు.  ఈ విషయంలో మాత్రం ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. కానీ ఎప్పటినుండో ఇండస్ట్రీ లో ఉన్నాడు. కానీ ఎక్కువ సంపాదించలేదు. చిన్న షాప్ ఉంది. తను కూడా జూనియర్ ఆర్టిస్ట్ లానే వచ్చాడు అని చెప్పాడు. జూనియర్ ఆర్టిస్ట్ లని చులకన చెయ్యడం నాకు చాలా బాధగా అనిపించింది” అని ఉమా దేవి అన్నారు.

watch video :

You may also like