Home Bigg Boss 5 telugu ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే..?

ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే..?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 6 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని సమాచారం.

Remunerations of Bigg Boss Telugu 5 contestants

ఈ వారం నామినేషన్స్ విషయానికొస్తే లోబో ఎలిమినేట్ అవుతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా లోబోకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ప్రియ, అనీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో అనీ మాస్టర్ ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని సమాచారం.ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు ఆగాల్సిందే.

You may also like