Ads
చూస్తుండగానే బిగ్‌బాస్ మూడవ వారం కూడా ముగిసింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి నుండి ఒక కంటెస్టెంట్ బయటికి వచ్చేస్తారు. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారు అందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవ్వడం గమనార్హం. దాంతో ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే ఆసక్తి ప్రజలలో నెలకొంది.
Video Advertisement

ఇవాల్టి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో నాగార్జున రవి, ప్రియ, లహరిలతో మాట్లాడుతున్నారు. నామినేషన్ ఎపిసోడ్ రోజు జరిగిన విషయం గురించి నాగార్జున వారి ముగ్గురిని అడుగుతున్నారు. లహరి ని పవర్ రూమ్ లోకి పంపించి ఒక వీడియో చూడమని చెప్పారు. అందులో రవి మాట్లాడిన ఒక క్లిప్ చూపించారు. ఆ క్లిప్ చూసిన తర్వాత లహరిని బయటికి వెళ్లి రవి, ప్రియలో తప్పు ఎవరిది కాదో వాళ్ళని హగ్ చేసుకో అని చెప్పారు నాగార్జున.
watch video :
End of Article
