Ads
బిగ్ బాస్ తెలుగు-5 లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఇప్పుడు అంతకు ముందు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ లో ఒక కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మళ్ళీ ప్రోగ్రాంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే, “ఈసారి ఏ కంటెస్టెంట్ హౌస్ లోకి తిరిగి రాబోతున్నారు?” అనే అంశంపై చర్చ నెలకొంది. వీరందరిలో ఒకరి పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. తనే లహరి.
Video Advertisement

లహరి ఎలిమినేషన్ అసలు ఎవరూ ఊహించలేదు. లహరి ఫైనల్స్ వరకు ఉంటుంది అని అనుకున్నారు. అలాంటిది అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవడం చాలా మంది ప్రేక్షకులని బాధకి గురి చేసింది. ఎంతో మంది నెటిజన్లు కూడా “లహరి మళ్లీ షోకి తిరిగి వస్తే బాగుండు” అని కామెంట్ పెట్టారు. దాంతో షో యాజమాన్యం లహరిని మళ్లీ హౌస్ లోకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.
End of Article
