బిగ్ బాస్ తెలుగు-6 చూసేవారికి బ్యాడ్ న్యూస్.. షో ఆపేస్తున్నారా..?

బిగ్ బాస్ తెలుగు-6 చూసేవారికి బ్యాడ్ న్యూస్.. షో ఆపేస్తున్నారా..?

by Megha Varna

Ads

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే. తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Video Advertisement

వరుసగా నాగార్జున నాలుగోసారి హోస్ట్ చేసిన సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకి గట్టి దెబ్బ తగిలింది. ప్రతి సీజన్ కంటే కూడా ఈ సీజన్ ప్రేక్షకులను అస్సలు అలరించలేకపోయింది. టీఆర్పీ కూడా పడిపోయింది. ఈ సీజన్ లో మాత్రం బిగ్ బాస్ కి ఎన్నో కష్టాలు వస్తున్నాయి. వీకెండ్ లో కూడా పెద్దగా టీఆర్పీ రావడం లేదు. బిగ్ బాస్ షో లో వచ్చే ఎపిసోడ్లకి కేవలం 2 నుండి 2.5 వరకు రేటింగ్ లభిస్తోంది. నాగార్జున వచ్చినప్పుడు మాత్రం ఒక 3 నుంచి 3.5 వరకు రేటింగ్ వస్తోంది.

కానీ ఇంత పెద్ద షో కి ఇంత తక్కువ టీఆర్పీ రావడం ఘోరం. సీరియల్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ షో కి టీఆర్పీ తక్కువ వస్తోంది. సీరియల్స్ కి 10 వరకు టీఆర్పీ వస్తుంటే బిగ్ బాస్ కి కేవలం నాలుగు కూడా దాటక పోవడం ఘోరాతి ఘోరం. దీనితో ఈ బిగ్ బాస్ సీజన్ నిర్వాహకులుకి భారీ షాక్ తగిలింది. టీఆర్పీ ని పెంచాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు.

పైగా నాగార్జునలో కూడా అంత ఫైర్ లేకపోయింది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఏ మాత్రము అలరించలేక పోతున్నారు. ఇది వరకు అయితే వీకెండ్ లో ఎంతో ఎంటర్టైన్మెంట్ లభించేది కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఒకవేళ కనుక ఈ సీజన్ మొత్తం ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ కంటెస్టెంట్స్, హోస్ట్ బాగుంటే మరొక సీజన్ ఉండొచ్చు కానీ ఇదే కనుక కొనసాగితే నెక్స్ట్ సీజన్ ఉండకపోవచ్చు.


End of Article

You may also like