“బిగ్‌బాస్ తెలుగు” ఫైనలిస్ట్ జవాన్ సినిమాలో నటించారా..? ఎవరంటే..?

“బిగ్‌బాస్ తెలుగు” ఫైనలిస్ట్ జవాన్ సినిమాలో నటించారా..? ఎవరంటే..?

by Mohana Priya

Ads

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా జవాన్. ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ టాక్ సంపాదించుకుంది.

Video Advertisement

సినిమా కథ చాలా మందికి తెలిసిన కథ అయినా కూడా బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు రావడం చాలా తక్కువ కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. అందులోనూ షారుఖ్ ఖాన్ ని ఇలాంటి మాస్ రోల్ లో చూడడం ఎప్పుడో ఒకసారి తప్ప అవ్వదు కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

jawan movie review

మరొక వైపు ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్ కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగిన ఒక ప్రేక్షకుడిని ఈ సినిమా చూడడానికి కూర్చోబెడితే మొదటి రెండు సీన్స్ చూడంగానే సినిమా మొత్తం చెప్పగలుగుతాడు. అంత రొటీన్ కథ ఉంది. ఈ సినిమాలో చాలా మంది సౌత్ కి సంబంధించిన నటులు, టెక్నీషియన్స్ ఉన్నారు. చాలా మంది తమిళ్ వాళ్లే ఉన్నారు. అయితే తెలుగుకి సంబంధించిన ఒక నటి కూడా ఈ సినిమాలో నటించారు.

ఆమె ప్రేక్షకులందరికీ టెలివిజన్ ద్వారా చాలా పరిచయం అయిన యాక్టర్. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగులో కూడా పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లారు. ఆమె ఎవరో కాదు సిరి. సిరి ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ పక్కన కానిస్టేబుల్ పాత్రలో నటించారు. కొడుకు షారుఖ్ ఖాన్ పోషించిన ఆజాద్ రాథోడ్ పాత్ర కనిపించినప్పుడు సిరి కూడా కనిపిస్తారు. సిరి అంతకుముందు చాలా టెలివిజన్ షోస్ లో కనిపించారు. బిగ్ బాస్ ప్రోగ్రాం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు.

siri hanumanth 1

ఆ తర్వాత పులి మేక అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా చేశారు. ఇప్పుడు జవాన్ సినిమాలో ఒక పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి సిరి మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ పక్కన నటించడం తనకి చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలని కూడా షేర్ చేశారు. సిరి టెలివిజన్ లో కూడా ఇప్పుడు పండగలకి, లేదా ఏమైనా ప్రత్యేక వేడుకలకి వచ్చే ఎన్నో స్పెషల్ షోస్ కి హోస్ట్ గా చేస్తున్నారు.

ALSO READ : “అనుష్క శెట్టి” లాగానే… తమకంటే “తక్కువ వయసు” ఉన్న హీరోలతో నటించిన 15 హీరోయిన్స్..!


End of Article

You may also like