మోనాల్ ఖాతాలో ఇంకొకరు బలి అంటూ… “బిగ్ బాస్” సండే ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

మోనాల్ ఖాతాలో ఇంకొకరు బలి అంటూ… “బిగ్ బాస్” సండే ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలేకి దగ్గర పడుతోంది. ఈ వారం ఎవరూ ఊహించని విధంగా జబర్దస్త్ అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. గత వారం నామినేషన్ ప్రక్రియలో అవినాష్ కి, మోనాల్ కి మధ్య చాలా సేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఫైనల్ రౌండ్ వరకు అఖిల్ ఇంకా సోహైల్ రాగా, అఖిల్ విజేతగా నిలిచారు. దాంతో అఖిల్ కి డైరెక్ట్ గా ఫినాలేకి టికెట్ లభించింది. ఈ టాస్క్ దాదాపు మూడు రోజులు కొనసాగింది. వీకెండ్ ఎపిసోడ్స్ లో కూడా ఎప్పటిలాగానే శనివారం ఎపిసోడ్ కొంచెం సీరియస్ గా, ఆదివారం ఎపిసోడ్ సరదాగా సాగింది. శనివారం ఎపిసోడ్ విషయానికొస్తే అభిజిత్, హోస్ట్ కింగ్ నాగార్జునతో కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి మాట్లాడారు.

Video Advertisement

గత వారం నాగార్జునని డిసప్పాయింట్ చేసినందుకు క్షమించమని అడిగారు అభిజిత్. నాగార్జున కూడా చిన్న తప్పే అని, పర్వాలేదు అని చెప్పారు. మోనాల్ కూడా కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి, తనని వీక్ కంటెస్టెంట్ అని అంటుంటే తనకు చాలా బాధగా ఉంది అని, తను ఇప్పుడు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాను అని, అయినా కూడా వీక్ అంటున్నారు అని బాధపడ్డారు. ఆదివారం ఎపిసోడ్ లో టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్, తమకి నచ్చిన కంటెస్టెంట్ కి ఒక పాట డెడికేట్ చేశారు. తర్వాత ఆ పాటలకి కంటెస్టెంట్స్ డాన్స్ చేశారు. చివరిలో డేంజర్ జోన్ లో మోనాల్ ఇంకా అవినాష్ మిగలగా, అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7

#8 #9 #10 #11 #12 #13 #14 #15 #16#17

#18


End of Article

You may also like