ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, ఇందులో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అనేది చూపిస్తారు. అంతే కాకుండా అలా అంత మంది ఒకే ఇంట్లో ఉంటే, అది కూడా వాళ్ళలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలియకపోతే అసలు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.

అయితే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ప్రోగ్రాం ప్రసారం అవ్వబోతోంది. ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

watch video :