Ads
- చిత్రం : ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
- నటీనటులు : సయ్యద్ సోహెల్ రయాన్, మృణాళిని రవి, రాజేంద్ర ప్రసాద్, మీనా.
- నిర్మాత : కోనేరు కల్పన
- దర్శకత్వం : ఎస్వీ కృష్ణారెడ్డి
- సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి
- విడుదల తేదీ : మార్చ్ 3, 2023
Video Advertisement
స్టోరీ :
సినిమా అంతా మామా అల్లుడికి జరిగే ఒక స్టోరీ మీద నడుస్తుంది. తన కూతురిని ఆ మామ అమ్మాయి ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేశాడా? అసలు ఆ అబ్బాయి ఎవరు? వారికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి? చివరికి అన్ని సమస్యలు ఎలా పరిష్కరించారు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఫ్యామిలీ సినిమాలకి పెట్టిన పేరు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎస్వీ కృష్ణారెడ్డి గొప్ప దర్శకులు మాత్రమే కాదు, మంచి డైలాగ్ రైటర్, అలాగే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయే ఎన్నో సినిమాలని ఎస్వీ కృష్ణారెడ్డి తీశారు. ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అలాగే బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయిన సోహెల్ ఇందులో హీరోగా నటించారు.
సినిమా మొత్తం కామెడీతో సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంది. ఎంతో మంది పెద్ద నటీనటులు ఈ సినిమాలో నటించారు. వారందరిని చూస్తూ ఉంటే ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలని మనం ఎంత మిస్ అయ్యాం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- కొన్ని చోట్ల ల్యాగ్ అయిన స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
కథ నుండి పెద్దగా కొత్తదనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, కథనం నుండి ఎక్కువగా ఏమి ఆశించకుండా, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకునే వారికి, అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలని ఇష్టపడే వారికి ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article