Home serials “ఒక్కదాన్నే కుమిలిపోయాను… నిద్రలేని రాత్రులు గడిపాను..!” అంటూ… ఎమోషనల్ అయిన “బిగ్‌బాస్” ఉమా దేవి..!

“ఒక్కదాన్నే కుమిలిపోయాను… నిద్రలేని రాత్రులు గడిపాను..!” అంటూ… ఎమోషనల్ అయిన “బిగ్‌బాస్” ఉమా దేవి..!

by Mohana Priya

మన తెలుగు సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలుసు. సీరియల్స్ కూడా సినిమాలతో సమానంగా పాపులర్ అవుతున్నాయి. ఇంకా చాలా మంది ప్రేక్షకులు అయితే సీరియల్ లో నటించే నటీనటులని తమ ఇంట్లో వారిగా భావిస్తారు. ముఖ్యంగా ఆ సీరియల్ లో నటించిన హీరో, హీరోయిన్లు అయితే ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోతారు.

ఇలా చాలా మంది సీరియల్ హీరో హీరోయిన్లని ప్రేక్షకులు వారి కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వారికి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్లు పోషించే పాత్రల పేర్లతో వాళ్లని పలకరిస్తారు.

bigg boss telugu uma devi in star maa parivar league 3

హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్స్ లో చాలా బాగా నటిస్తారు. అందుకే ఈ సీరియల్స్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్లకి ఉన్నంత పాపులారిటీ ఉంది. అలా ఇటీవల గత కొంత కాలం నుండి పాపులర్ అయిన సీరియల్స్ లో రెండు సీరియల్స్ చెల్లెలి కాపురం, శ్రీమతి శ్రీనివాస్. అయితే ఈ రెండు సీరియల్స్ లో నటించే కొంత మంది నటులు మా టీవీలో టెలికాస్ట్ అయ్యే స్టార్ మా పరివార్ లీగ్ ప్రోగ్రాంకి వచ్చారు. వీరిలో ఉమా దేవి కూడా ఉన్నారు. ఉమా దేవి బిగ్ బాస్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు.

bigg boss telugu uma devi in star maa parivar league 3

ఒక సందర్భంలో ఉమా దేవి తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెప్పారు. “నేను అందరూ గయ్యాళి అని అనుకుంటారు. నేను స్ట్రాంగే. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి పెళ్లీడుకి వచ్చింది. నేను చేద్దామని చూసినా దగ్గరికి రానివ్వట్లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఒక్క దాన్ని పోరాడుతూ ఉంటే చాలా కుమిలిపోయాను. మీ అమ్మ అలాంటిది కదా అని వాళ్ళ జీవితాలు నా వల్ల పాడవుతాయా అని ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు గడిపాను” అని చెప్పారు.

watch video :

You may also like