బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వబోయే ఆ సెలబ్రిటీలు ఎవరంటే?

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వబోయే ఆ సెలబ్రిటీలు ఎవరంటే?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ షో మొదలైంది. ప్రతి సీజన్ లో ఉన్నట్టే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆడియన్స్ కి ఏ కంటెస్టెంట్ ఎలాంటి వారు అనే క్లారిటీ వచ్చేస్తుంది. దాన్నిబట్టి ఎలిమినేషన్, ఇంకా సేవ్ చేయడం అనేవి ఉంటాయి. మనం చూస్తూ ఉండగానే సీజన్ ఎండ్ కూడా అయిపోతుంది. ప్రతి సీజన్ మొదలవడానికి, అయిపోవడానికి మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది, అదే వైల్డ్ కార్డ్.

Video Advertisement

అందరు కంటెస్టెంట్స్ కి ఒకళ్ళకి ఒకళ్ళు అలవాటైపోయిన సమయంలో అప్పుడు షో లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో ఒక కంటెస్టెంట్ ఎంటర్ అవుతారు. తర్వాత కొద్ది రోజులకి మరొక కంటెస్టెంట్ కూడా వైల్డ్ రికార్డ్ ఎంట్రీ ఇస్తారు. బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్స్ విషయం లో సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక సమయంలో చాలా మార్పులు జరిగాయి.

అంటే ముందు కొంతమంది కంటెస్టెంట్ లను ఎంపిక చేసుకొని వారిని క్వారంటైన్ లో పెట్టారు. అప్పుడు ఆ కంటెస్టెంట్స్ లో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడం, లేదా ఇంకేదైనా వేరే విషయాల కారణం గా ముందు అనుకున్న లిస్ట్ లో కొంతమంది కంటెస్టెంట్స్ రిప్లేస్ అయ్యారు అనే వార్తలు గత కొద్ది రోజులుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలా బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్స్ పేర్లు వైరల్ అయినట్టే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. సమయం కథనం ప్రకారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వబోయే ఆ సెలబ్రిటీలు ఎవరంటే.

#1 జబర్దస్త్ అవినాష్

#2 సాయి కుమార్ (ఈ రోజుల్లో, బస్ స్టాప్ ఫేమ్ )

#3 స్వాతి దీక్షిత్ (జంప్ జిలాని ఫేమ్ )


End of Article

You may also like