ఎన్నో గొడవలు, కాంట్రవర్సీలు, మధ్యలో టాస్క్ లతో నాలుగవ వారం పూర్తి చేసుకుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్, జంప్ జిలాని ఫేమ్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం లో సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా , రెండవ వారం నామినేషన్స్ లో కరాటే కళ్యాణి, మూడవ వారం నామినేషన్స్ లో దేవి నాగవల్లి, నాలుగవ వారం నామినేషన్స్ లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు.

అయితే సోమవారం నాడు 5వ వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో కొంతమంది కంటెస్టెంట్స్ నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఉదాహరణకి దివి, లాస్య ని నామినేట్ చేస్తూ నామినేట్ చేయడానికి గల కారణం లాస్య చేసిన పప్పు తినడం వల్ల వాళ్ళందరికీ వాంతులు అయ్యాయి అని చెప్పారు. లాస్య దీనికి ఒప్పుకోలేదు తర్వాత మళ్ళీ వేరే కారణం చెప్పారు దివి.

అలాగే అఖిల్, అభిజిత్ మధ్య గొడవ అవ్వడం, అందులో మోనాల్ పేరు రావడం, తనని ఇన్వాల్వ్ చేయొద్దని మోనాల్ ఏడవడం ఇలా సోమవారం చాలా జరిగాయి. ఇంకా మంగళవారం విషయానికొస్తే నిన్న హోటల్ టాస్క్ జరిగింది. అందులో అరియానా ప్రిన్సెస్ లాగా, గంగవ్వ అరియానా కి తల్లి లాగా, అభిజిత్ హోటల్ ఉద్యోగి లాగా, అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా వేరే వేరే గెటప్స్ వేశారు. ఈ వారం లో జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ పై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18