బిగ్ బాస్ విన్నర్ లకు కలిసొచ్చిన ఈ “11” సెంటిమెంట్ ఏంటి.? ఈ లెక్కన ఈ సారి విన్నర్ అభి.?

బిగ్ బాస్ విన్నర్ లకు కలిసొచ్చిన ఈ “11” సెంటిమెంట్ ఏంటి.? ఈ లెక్కన ఈ సారి విన్నర్ అభి.?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి వారంలోకి అడుగు పెట్టింది. గత వారం ఎలిమినేషన్ లో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు అభిజిత్, అరియానా, సోహెల్, అఖిల్, హారిక టాప్ ఫైవ్ ఫైనలిస్ట్స్ గా నిలిచారు. వచ్చే ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫినాలే జరగనుంది. ఇంక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బిగ్ బాస్ విజేత ఎవరో తెలుసుకోవడానికే.

Video Advertisement

టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఎవరికి వాళ్లు చాలా స్ట్రాంగ్ కాబట్టి విజేత ఎవరు అనే విషయంపై ప్రజలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కానీ మెజారిటీ మాత్రం ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ విజేత అవుతారు అని అనుకుంటున్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరో ఈపాటికే మీలో చాలా మందికి అర్థం అయిపోయి ఉండొచ్చు. మొదటి నుంచి ఇప్పటివరకు కన్సిస్టెంట్  గా ఉన్న కంటెస్టెంట్ అభిజిత్.

11 సార్లు నామినేషన్ లోకి వెళ్ళినా కూడా ప్రేక్షకుల ఓట్లతో అభిజిత్ సేవ్ అయ్యారు. ఇంక దీన్ని బట్టి మెజారిటీ శాతం ప్రేక్షకులు ఎవరిని విజేతగా అనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ సీజన్ విన్నర్ అభిజిత్ అని ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా గత రెండు సీజన్స్ లో చూసుకుంటే. సీజన్ 2 లో విజేతగా నిలిచిన కౌశల్ 11 సార్లు నామినేట్ అయ్యారు.

అలాగే సీజన్ 3 లో విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆ సీజన్ మొత్తం కలిపి 11 సార్లు నామినేషన్ లోకి వెళ్లారు. అయితే ఇలా చూసుకుంటే సీజన్ 4 లో అభిజిత్ 11 సార్లు నామినేషన్ లోకి వెళ్లారు. అలా 11 సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి అభిజిత్ విజేత గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

ఈ సస్పెన్స్ ఆగాలంటే ఇంకొక రెండు రోజులు వరకు ఎదురు చూడాల్సిందే. ఇంక బిగ్ బాస్ ఫినాలే విషయానికొస్తే శుక్రవారం ఎపిసోడ్ నుండి పాత కంటెస్టెంట్స్ రావడం మొదలైంది. కానీ ఈ సారి కరోనా కారణంగా డైరెక్ట్ గా కాకుండా మధ్యలో ఒక ఒక షీట్ అడ్డం పెట్టి టాప్ ఫైవ్ హౌస్ మేట్స్ తో పాత కంటెస్టెంట్స్ మాట్లాడే ఏర్పాట్లు చేశారు.


End of Article

You may also like