Ads
బీహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు మిథాలీ ఠాకూర్. ఈమె గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, ఈమె వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. అలీనగర్ నియోజకవర్గం ఆమె రాష్ట్రీయ జనతాదళ్ (గ్రాండ్ అలయన్స్) అభ్యర్థి, రాజకీయ అనుభవజ్ఞుడైన వినోద్ మిశ్రాకి పోటీగా మైథిలి ఎన్నికల్లో విజయం సాధించారు. మైథిలి దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు సమాచారం.
Video Advertisement

అలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యి, బీహార్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. మైథిలి హిందీ వారికి, సంగీత ప్రియులకు చాలా సుపరిచితులు. మైథిలి ఒక గాయని. జానపద పాటలు పాడడంలో మైథిలి దిట్ట. 2024 లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్బంగా మైథిలి శబరిపై ఒక పాట పాడారు. మోదీ కూడా మైథిలిని ఈ పాట విని ప్రశంసించారు.
హిందీలో సరిగమప, ఇండియన్ ఐడల్ వంటి కార్యక్రమాల్లో కూడా మైథిలి పాల్గొన్నారు. బీహార్‌లోని మధుబని జిల్లాలోని బేణిపట్టికి చెందిన మైథిలి, జూలై 25, 2000 న జన్మించారు. జానపద, భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. 2021 లో, సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నారు.
మైథిలికి ఎన్నో మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్, ఎన్నో లక్షల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి. అందులో తన పాటలను పాడి పోస్ట్ చేస్తూ ఉంటారు మైథిలి. మైథిలి తండ్రి సంగీత ఉపాధ్యాయుడు రమేష్ ఠాకూర్. తల్లి భారతి ఠాకూర్. మైథిలికి ఇద్దరు సోదరులు ఉన్నారు. మిథిలా ప్రాంతంలో పాతుకుపోయిన సాంప్రదాయ జానపద కళారూపమైన మధుబని కళను ప్రోత్సహించడంలో, ఆ కళకి ప్రాముఖ్యత తీసుకురావడంలో మైథిలి ఠాకూర్ కీలక పాత్ర పోషించారు
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద అవగాహన తీసుకురావడానికి మైథిలి తన గాత్రం ద్వారా తన వంతు కృషి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మైథిలి ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారు అని తన అభిమానులతో పాటు, బీహార్ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
End of Article
