భార్య భర్తకి రాసిన మరణ శాసనం..! బైక్ లిఫ్ట్ మిస్సింగ్ కేస్ లో ట్విస్ట్ ఏంటంటే..?

భార్య భర్తకి రాసిన మరణ శాసనం..! బైక్ లిఫ్ట్ మిస్సింగ్ కేస్ లో ట్విస్ట్ ఏంటంటే..?

by Megha Varna

Ads

దేవుడా పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు అయ్యింది. లిఫ్ట్ ఇవ్వడం కూడా పాపమేనా..? ఖమ్మం జిల్లాలో బైక్ పై ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి అపరిచితుడికి లిఫ్ట్ ఇచ్చాడు అంతే ప్రాణాలే పోయాయి. బైక్ మీద కూర్చున్న వ్యక్తి ఇంజక్షన్ చేయడం వల్లనే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చనిపోయాడు.ఇక మరి అసలు ఏమైంది అనేది చూస్తే.. షేక్ జమాల్ సాహెబ్ (50) ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం బొప్పారంకు చెందిన అతను.

Video Advertisement

వ్యవసాయం చేస్తుండేవాడు. తన కూతురికి గండ్రాయి గ్రామానికి చెందిన అతనికిచ్చి పెళ్లి చేసాడు. మోటర్ సైకిల్ మీద ఓ రోజు జమాల్ సాహెబ్ గండ్రాయి వెళ్తుండగా.. దారిలో ఓ వ్యక్తి బైక్ ఆపి లిఫ్ట్ అడిగాడు. ఆ తరవాత వెనుకాల కూర్చున్న వ్యక్తి తన బుద్దిని చూపించాడు.

ఈ వ్యక్తి మంకీ క్యాప్ ధరించి బాణాపురం దాటిన తరువాత ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. ఇలా జమాల్ సాహెబ్ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలంకి చేరుకొని పరీక్షించారు. నిందితుడు మాత్రం బండి తో పరారయ్యాడు. ఘటనా స్థలంలో ఇంజక్షన్, సిరంజీ అయితే వున్నాయి. జమాల్ చనిపోయాడని వైద్యులు చెప్పారు.

ఇంతకీ అసలు ఎవరు చంపారు..?

షేక్ జమాల్ సాహెబ్ చనిపోవడానికి కారణం తన భార్య హిమాంబీ అని తెలుస్తోంది. ఇంట్లోనే ఇంజెక్షన్ పెట్టుకుంది భార్య. ఎన్నో సార్లు ఇంజెక్షన్ చేసేందుకు ప్రయత్నం చేసింది కానీ ఆమె భయంతో దాడి చెయ్యలేకపోయింది. ప్రియుడి కోసమే ఈ దాడి చేస్తోందని తెలుస్తోంది. ప్రియుడు మోహన్ రావు, భార్య హిమాంబీ పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

wife husband mystery

మోహన్ రావు, హిమాంబీ తో పాటుగా వెంకటేష్, వెంకట్ ని కూడా అదుపు లోకి తీసుకున్నారు పోలీసులు. వెంకటేష్, వెంకట్ ప్రమేయం ఈ హత్యలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కూతురి ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసారు. మార్గం మధ్యలో హత్య చేయాలనుకున్నారు. అనుకున్నట్టే ప్లాన్ పూర్తయింది. అయితే మోహన్ రావు, వెంకటేష్, వెంకట్ వెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్ లిఫ్ట్ అడుగుతాడు.

wife husband mystery

అప్పుడు జమాల్ సాహెబ్ ఎక్కించుకుని వెళ్తుండగా ఇంజెక్షన్ ఇచ్చేసాడు. తరవాత వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతుంది. బండి స్లో చేసే సరికి వెంకట్ పారిపోయాడు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులకి నిందితులు ఎవరో తెలిసిపోయింది. నాలుగు బృందాల పోలీసులు రంగంలో దిగి భార్యపై అనుమానం వచ్చి కాల్ డేటాని చూసి కనుగొన్నారు.

watch video :


End of Article

You may also like