అదృష్టం అంటే ఇదే అనుకుంటా …కేరళలో ఓ ఉపాధ్యాయుడికి భయానక అనుభవం ఎదురైంది..ఓ వ్యక్తి తన తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకున్నాకా కానీ అతనికి అసలు విషయం అర్ధం కాలేదు….కేరళకు చెందిన రంజిత్, సంస్కృత భాషా ఉపాధ్యాయుడు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 5న కందనాడ్‌లోని మేరీ హైస్కూల్లో తరగతులు ముగించుకుని మరో స్కూల్‌కు ద్విచక్ర వాహనంపై  ప్రయాణం అయ్యాడు.మార్గ మధ్యంలో కూడా ఆయనకు ఎలాంటి అనుమానమూ రాలేదు.తీరా స్కూలుకు చేరుకున్నాక హెల్మెట్ తీసి చూసుకుంటే విష సర్పం కనిపించింది.  ఓ పాము చనిపోయి కనిపించింది. తాను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే చనిపోయిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనేది తెలియలేదు.

రంజిత్‌కు ఆ పాము నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోయినా అతడి సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి రక్త పరీక్ష చేశారు. అయితే ఆ పాము అతడిని కాటేయలేదని చెప్పారు.కేరళలో ఈ మధ్య పాముల బెడదపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2019, డిసెంబర్‌లో ఓ వ్యక్తి బావిలో పడ్డ అనకొండను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ సహసికుడిని షంగీల్ అని తర్వాత తెలిసింది.

Testing

If you want to contribute content on our website, click here

Cryptoknowmics
Sharing is Caring:
No more articles