Ads
- చిత్రం : యాంగర్ టేల్స్
- నటీనటులు : వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్
- నిర్మాత : శ్రీధర్ రెడ్డి & సుహాస్
- దర్శకత్వం : ప్రభల తిలక్
- సంగీతం : స్మరణ్ సాయి
- విడుదల తేదీ : మార్చి 09, 2023
Video Advertisement
స్టోరీ :
ఈ కథ మొత్తం నలుగురి వ్యక్తులకి సంబందించినది. నలుగురూ వాళ్ళ జీవితం లో ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నారు అనేది ఈ కథ. పూజా రెడ్డి(మడోనా సెబాస్టియన్) కి పెళ్లి తరవాత వారి అత్తా వారింట్లో పెట్టిన రూల్స్ తో నచ్చిన ఆహారాన్ని తీసుకోలేదు. ఆమె ఈ కారణంగా ఇబ్బంది పడుతుంది. అలానే గిరిధర్ (ఫణి ఆచార్య) కి బట్టతల ఉంటుంది. దానితో పర్సనల్ గా, ప్రొఫిషినల్ గా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ టైం లో యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని..
అలానే రాధ (బిందు మాధవి) ఓ గృహిణి. ఈమె కూడా పలు సమస్యలని ఎదుర్కొంటుంది. రంగా (వెంకటేష్ మహా) ఒక స్టార్ హీరో ఫ్యాన్. తన హీరో బెనిఫిట్ షో కోసం ఏం చేసాడు..? ఇది కథ. ఈ నాలుగు వైపులా సినిమా నడుస్తుంది. ఈ అంథాలజీ లో మెయిన్ ఇవే కనపడతాయి. వీరి భావోద్వేగాలు ఎలా ఉంటాయి…? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది అనేది చూడాల్సింది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో యాంగర్ టేల్స్ స్ట్రీమింగ్ అవుతోంది.
రివ్యూ :
నేపథ్యం ఒకొక్క పాత్రకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నటుల యాక్టింగ్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా వెంకటేష్ మహా చేసిన రంగ పాత్ర చాలా బాగుంది. అంటే సుందరానికి లో చేసిన నటన కి మించి దీనిలో ఉంటుంది. సాలిడ్ ఎమోషన్స్, డీసెంట్ ఫన్ ఇవన్నీ ఉంటాయి. మడోనా, తరుణ్ భాస్కర్ కూడా చాలా చక్కగా నటించారు. అలానే ఎమోషన్స్ కి తగ్గట్టుగా స్మరన్ సాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్:
- కాన్సెప్ట్
- కామెడీ
- నటులు
మైనస్ పాయింట్స్:
- 2,3 టేల్స్ ఎఫెక్టీవ్ గా లేకపోవడం
- కొత్తగా లేకపోవడం
- అనవసర సన్నివేశాలు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్:
కొన్ని అంశాలు బాగా ఆకట్టుకుంటాయి. పూర్తి స్థాయిలో ఏమి ఆకట్టుకోదు. సిరీస్ నేపథ్యం బాగుంటుంది. నటుల నటన బాగుంటుంది. ఒకసారి కావాలనుకుంటే చూడచ్చు.
watch trailer:
https://youtu.be/tgMj9ge3mzQ
End of Article