Ads
సృష్టిలో మానవులు, పక్షులు, జంతువులు అందరూ అన్నీ కూడా భాగమే. ఈ సృష్టిలో మానవులకి ఎలా బ్రతికే హక్కు ఉందొ అలాగే పక్షులకి, జంతువులకి కూడా ఉంది. కానీ కొన్ని జీవ రాశులు మనువుల చేత హింసించబడుతున్న సంగతి తెలిసిందే. మానవులు భుజించే మాంసాహారం కొన్ని జంతువులని, పక్షులని చంపి తినేస్తూ ఉంటారు.
Video Advertisement
మాంసాహారం మానివేయమని, శాకాహారం తీసుకోవడమే ఉత్తమమని పలువురు నిపుణులు, డాక్టర్లు సూచిస్తునే ఉన్నారు కూడా. ఇక ఇంటివద్ద కూడా కొందరు శునకాన్ని, పిల్లిని పెచుకుంటూ ఉంటారు జంతు ప్రేమికులు.. అలాగే పక్షులని కూడా పెంచునే వారు ఉన్నారు..! ఇలా ఒక పక్షి కరెంటు వైర్ల మధ్య చిక్కుకుని ఎగరలేక ఇబ్బంది పడుతున్న ఆ పక్షిని గుర్తించి రక్షించే ప్రయత్నం చేసారు అధికారులు.
రెక్కలు కరెంటు వైర్లకి చిక్కుకుని ఇబ్బంది పడుతున్న ఆ పక్షిని హెలికాప్టర్ సాయం తో రక్షించారు. అలా ఆ సమయంలో కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందని పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రాణానికి తెగించి రక్షించిన ఆ అధికారికి అందరూ కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు. కొన్ని వందల సంఖ్యలో షేర్లు కూడా చేసారు.
https://www.instagram.com/p/CTTayrspghd/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
End of Article