ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్ట్‌ లకు పక్షుల బెడద ఎక్కువ అయ్యింది. ఇప్పటి  వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. చుట్టుపక్కల ఉండే జనావాసాలు, అపరిశుభ్రమైన పరిసరాలు, చెరువుల కారణంగా ఎయిర్‌పోర్ట్‌ లకు పక్షుల తాకిడి బాగా పెరిగింది.

Video Advertisement

రీసెంట్ గా రియాద్‌ నుండి హైదరాబాద్‌ కు వచ్చిన ఎస్‌వీ 744 ప్లైన్ లాండ్‌ అవుతున్న టైమ్ లో ఒక పక్షి ఢీకొనడంతో  ఆ విమానం యొక్క ముందు భాగానికి సొట్ట ఏర్పడడం జరిగింది. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్‌ లకు పక్షుల బెడద ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంది. ప్రమాదం జరుగకపోయినా ఈ ఘటన పక్షుల సమస్యను ఆలోచించేలా చేస్తోంది.
ప్రతిరోజూ రాకపోకలు సాగించే నేషనల్, ఇంటర్నేషనల్ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మల్లికార్జున ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌ లో జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మతో మరియు సివిల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పోర్ట్‌ ట్రస్ట్‌, జీవీఎంసీ,ఇండియన్‌ నేవీ, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ యొక్క ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు.
దీనిలో రన్‌వేలో నీటి నిల్వ, విమానాశ్రయం పరిసరాల్లో చెత్త డంపింగ్‌, పక్షుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌ ఉన్న ప్రాంతం జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఉండడం వల్ల అధికంగా వ్యర్థాలు అక్కడ చేరుతున్నాయని అన్నారు. మేహాద్రి గెడ్డ కాలువలో మేకల, కోళ్ల మాంసపు వ్యర్థాలు ఎక్కువగా వేస్తున్నారని, అందువల్ల ఆ పరిసరాలు పక్షులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయని అన్నారు.
ఈ కారణంగా పక్షుల సంఖ్య పెరగడంతో విమానాల రాక, పోకలకు అవి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మీట్ షాప్ లను తొలగించాలని, పారిశుధ్య చర్యలను తీసుకోవాలని కలెక్టర్ జీవీఎంసీ ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే ఈ విషయం పై జనాలకు కూడా  అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. భారీ వర్షాల సమయంలో  నీరు ఎయిర్‌పోర్ట్‌ లోకి వెళ్ళకుండా కావాల్సిన నిర్మాణాలు, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read: తిరుమలలో పిల్లలపై దాడి చేసిన చిరుతపులి ఇదేనా..? ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే..?